ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని తెలిసిందే. అయితే ఈ ఫైట్‌ను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు.
ఈ ఇద్దరు టెక్ టైటాన్‌లు గత నెలలో కేజ్ ఫైట్‌లో ఒకరినొకరు ఎదుర్కొనే సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆన్‌లైన్ షేక్ అవుతోంది. తరచూ వరి ఫైట్ గురించే చర్చ జరుగుతోంది. వారి ప్రత్యక్ష యుద్ధాన్ని వీక్షించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘జుక్ Vs మస్క్ ఫైట్ ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని వెటరన్స్ సంక్షేమానికి వెచ్చిస్తాం’ ట్వీట్ చేశారు. పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని, రోజంతా బరువులు ఎత్తుతున్నానని అంతకుముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే తనకు వర్కవుట్ చేసేందుకు సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు.
ఈ సందర్భంగా వారి ఫైట్ గురించి ఓ యూజర్ ప్రస్తావించగా మస్క్ స్పందిస్తూ "ఇది ఒక నాగరిక యుద్ధం. మగాళ్లు యుద్ధాన్ని ఇష్టపడతారు" అని బదులిచ్చారు. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్‌బర్గ్ మధ్య అన్ని విషయాల్లోనూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది.
జుకర్‌బర్గ్‌తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్‌లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్‌బర్గ్
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్. కేజ్ ఫైట్‌పై ఇద్దరూ పరస్పర పోస్టులు పెడుతూ ఫాలోవర్లలో ఉత్తేజం నింపుతున్నారు.
Zuck v Musk fight will be live-streamed on 𝕏.
— Elon Musk (@elonmusk) August 6, 2023
All proceeds will go to charity for veterans.
Comments
Please login to add a commentAdd a comment