Pay Package
-
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా?
టోక్యో: ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల హవా కొనసాగుతోంది. జపాన్‌కు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు, సీవోవో నికేష్ అరోరా (48) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 5వందలకోట్ల భారీ వేతనంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 73 మిలియన్ డాలర్ల పే ప్యాకేజీ తో వరుసగా రెండవసంవత్సరం కూడా వరల్డ్ టాప్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా అవతరించారు. ఇప్పటికే జపాన్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న అరోరా ఈ స్పెషల్ ప్యాకేజ్ తో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న టెక్ దిగ్జజాలు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ , వాల్ట్ డిస్నీ యొక్క బాబ్ ఇగెర్ సరసన చేరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు అధిపతులుగా భారతీయులు ఉన్నత స్థానాల్లో అత్యధిక వేతనాలు పొందుతూ రికార్డు సృష్టించారు. కాగా 2014 ఆర్థిక సంవత్సరానికి 13.5 కోట్ల డాలర్ల వేతనాన్నిఅందుకున్నఅరోరా గతంలో గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. నికేష్ అరోరా ఆధ్వర్యంలోనే సాఫ్ట్ బ్యాంక్ భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
విప్రో సీఈవో జీతం పెరిగిందట
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా వార్షిక వేతనం పెరిగిందట. ఆయన ఈ ఏడాది అక్షరాల రూ.12.04 కోట్ల వేతనం పొందుతున్నారట. ఈ వేతనం అంతకముందు మాజీ సీఈవో టీకే కురియన్ కంటే ఎక్కువట. నీముచ్ వాలా బేసిక్ జీతం, అలవెన్స్ కింద రూ.5,75,85,354, కమిషన్ అండ్ వేరియబుల్ చెల్లింపుల కింద రూ.2,35,42,334లు ఇతర చెల్లింపుల కింద రూ. 3,85,51,290లు దీర్ఘకాలిక పరిహారం కింద రూ.14,22,140లను ఈ ఏడాది అందుకుంటున్నారని రెగ్యులేటరీకి విప్రో నివేదించింది. ఈ ఏడాది ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ సైతం రూ.48.73 కోట్లకు ఎగిసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ జీతం సైతం రూ.25.6 కోట్లకు పెరిగి, అదనంగా స్పెషల్ బోనస్ రూ.10 కోట్లను అందుకుంటున్నారు. 2015లో గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నీముచ్ వాలా విప్రోలో చేరారు. 2016 మార్చి ఆర్థికసంవత్సరం ముగిసిన సందర్భంగా నీముచ్ వాలా 200,000 స్టాక్ అప్షన్లను పొందారు. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.545.90గా ఉంది. ఈ స్టాక్ విలువ దాదాపు రూ.10.9 కోట్లు. విప్రో మాజీ సీఈవో, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టీకే కురియన్ ప్రస్తుతం రూ.21 కోట్ల వేతనం పొందుతున్నారు.