ఇండోర్ : బీజేపీ ప్రధానిమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకీ భద్రత మరింత పెంచాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఆదివారం పాట్నాలో మోడీ నిర్వహించిన సభకు కూతవేటు దూరంలో బాంబు పేలుళ్లు సంభవించడం తీవ్రమైనదిగా ఆయన పరిగణించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఆదివారం రాత్రి చౌహాన్ మీడియాతో మాట్లాడారు.
నరేంద్ర మోడీ ఇప్పుడు దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి కావడంతో అతనికి భద్రత పెంచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చౌహాన్ తెలిపారు. ఈ ఘటన ఎటువంటి విమర్శలకు దారితీయకుండా ఉండాలండే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. మధ్యప్రదేశ్ లోని సత్తా పరివర్తన్’ ర్యాలీల్లో గురువారం పాల్గొన్న రాహుల్ ముజాఫర్ నగర బాధితులకు పాకిస్థాన్ గాలం వేస్తుందని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. పాకిస్తాన్ గాలం వేస్తుంటే ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయన్నారు.