బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్, శివసేన నేతలను జోకర్లుగా అభివర్ణించారు.
ఆ ముగ్గురు రాజకీయ జోకర్లు
కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా, శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోకర్లని, వాళ్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇలా చేస్తూనే ఉంటారు. ప్రజలు వాటిని ఎంటర్‌టైన్‌గా భావిస్తారని తెలిపారు.
ఎవరూ సీరియస్‌గా తీసుకోరు
వారి స్థాయి కంటే దిగజారి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప‍్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో రాజకీయ జోకర్లుగా మారారు. అయ్యర్, పిట్రోడా, రౌత్‌లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు అని చౌహాన్ వ్యాఖ్యానించారు.
56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ
‘ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మేధోపరంగా దివాళా తీశారు. ఇది మునుపటి బలహీనమైన యూపీఏ ప్రభుత్వం కాదని, 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం’ అని ఇదే విషయాన్ని అయ్యర్ గమనించాలి చౌహాన్ సూచించారు.
భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్
మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చౌహాన్.. ‘భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేశారని అన్నారు. అదే సమయంలో దేశానికి ఇబ్బంది కలిగించే ఎవరినీ విడిచిపెట్టరని హెచ్చరించారు.
ప్రపంచ దేశాలకు భారత్ విశ్వ గురువు
‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం విశ్వ గురువుగా మారుతుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ మరో ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడవలసి ఉంటుంది. కానీ అలా చేయడానికి తగినంత మంది సభ్యులు ఉండరు’ అని చౌహాన్ నొక్కాణించారు.
Comments
Please login to add a commentAdd a comment