భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మరో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. చీతా ప్రాజక్టులో భాగంగా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను శనివారం ఉదయం ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేం.
సుమారు 74 ఏళ్ల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. మొత్తం ఎనిమిది చీతాలను ప్రత్యేక పరిస్థితుల నడుమ భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని నమీబియా పరిస్థితులకు దగ్గరగా ఉండే షియోపూర్ ప్రాంతంలో కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు. మోదీ స్వయంగా వాటిని ఫొటోలు తీస్తూ కనిపించారు.
Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV
— ANI (@ANI) September 17, 2022
చీతా ప్రాజెక్టులో భాగంగా.. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో బోయింగ్ విమానంలో వాటిని శనివారం గ్వాలియర్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆ విమానానికి స్వాగతం పలికారు. ఆపై ఆ చీతాలను వైమానిక విమానంలో కునో నేషనల్ పారర్క్కు తరలించారు. మూడు మగ, ఐదు ఆడ చీతాలతో జనాభా పెంచే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment