బోధ్‌ గయను సందర్శించడానికి వచ్చి.. | In Bihar Australian Man Found Hanging | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 4:22 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

In Bihar Australian Man Found Hanging - Sakshi

పాట్నా : బౌద్దుల పవిత్ర పుణ్యక్షేత్రం బోధ్‌ గయాను దర్శించడానికి వచ్చిన ఓ ఆస్ట్రేలియన్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివరాలు.. సిడ్నికి చెందిన హీత్‌ అల్లాన్‌ అనే వ్యక్తి బోధ్‌ గయను దర్శింకుందామని బిహార్‌ వచ్చాడు. ఈ క్రమంలో సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం అడవికి వెళ్లిన స్థానికులకు ఉరేసుకుని మరణించిన హీత్‌ కనిపించాడు. వెంటనే వాళ్లు ఈ విషయం గురించి పోలీస్‌లకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హీత్‌ బ్యాగ్‌, డైరీ, వాటర్‌ బాటిల్‌తో పాటు ఓ సూసైడ్‌ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిలో హీత్‌ తన సోదరి ఫోన్‌ నంబర్‌ రాసి.. ఈ విషయం గురించి ఆమెకి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హీత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement