'మహాబోధి'భద్రతకు నెలకు రూ.50 లక్షలు! | Mahabodhi temple security to cost Rs.5 mn monthly | Sakshi
Sakshi News home page

'మహాబోధి'భద్రతకు నెలకు రూ.50 లక్షలు!

Published Wed, Aug 14 2013 3:41 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

'మహాబోధి'భద్రతకు నెలకు రూ.50 లక్షలు!

'మహాబోధి'భద్రతకు నెలకు రూ.50 లక్షలు!

బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుద్ద గయలోని మహాబోధి ఆలయానికి పటిష్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అమీర్ సుభాని బుధవారం పాట్నాలో వెల్లడించారు. ఆ ఆలయ భద్రత బాధ్యతలను ఇకపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల (సీఐఎస్ఎఫ్) సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు. 261 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆలయాన్ని పహరా కాస్తుంటారని చెప్పారు. అందుకోసం నెలకు రూ.50 లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు.

 

సిబ్బంది జీతభత్యాల కింద ఆ  మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తామని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర హోం శాఖకు నివేదికను సమర్పించినట్లు తెలిపారు. తుది నిర్ణయం రావాలసి ఉందని అన్నారు. ఈ ఏడాది జూలై 7న మహాబోధి ఆలయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. దాంతో ఆ రాష్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని ప్రధానికి లేఖ రాశారు. అందుకు సంబంధించిన ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి షిండే ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్దుడు మహాబోధి దేవాలయంలోని వృక్షం కింద జ్ఞనోదయం పొందాడు. దీంతో దేశవిదేశాల నుంచి ఏటా వేలాది మంది పర్యాటకులు ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా  2002లో యూనెస్కో ఆ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement