Mahabodhi Temple
-
ఆలయానికి ఆదాయపన్ను నోటీసులు
బుద్ధగయలోని మహాబోధి ఆలయానికి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపింది. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన బౌద్ధక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయం.. విరాళాల ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నా, వార్షిక ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదని ఓ అధికారి తెలిపారు. రిటర్నులు ఎందుకు దాఖలు చేయలేదంటూ ఆలయ పాలక మండలికి నోటీసు ఇచ్చినట్లు ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ సౌరవ్ రాయ్ తెలిపారు. ఈ నోటీసులు తమకు అందినట్లు పాలకమండలి సభ్య కార్యదర్శి ఎన్ దోర్జీ తెలిపారు. కమిటీ రిటర్నులు దాఖలు చేయని మాట కూడా వాస్తవమేనన్నారు. అయితే అందుకు కారణం ఆదాయపన్ను శాఖేనని, ఆ శాఖ ఇంతవరకు ఆలయ కమిటీకి పాన్ కార్డు జారీ చేయలేదని ఆయన చెప్పారు. పాన్ కార్డు లేకుండా అసలు తమ కమిటీ రిటర్నులు ఎలా దాఖలు చేయగలదని ఆయన ప్రశ్నించారు. అయితే.. అనధికారిక సమాచారం ప్రకారం, అసలు ఈ కమిటీ ఇంతవరకు ఎప్పుడూ ఆదాయ వ్యయాల రిటర్నులు దాఖలు చేయనేలేదని ఓ అధికారి చెప్పారు. -
మహాబోధి ఆలయానికి ఐటీ నోటీసు
-
మహాబోధి ఆలయానికి ఆదాయపన్ను నోటీసు
బీహార్‌లో ఇటీవల ఉగ్రవాదుల దాడికి గురైన మహాబోధి ఆలయానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ ఆలయానికి నోటీసులు జారీచేసింది. ఆలయ ఆదాయ, వ్యయాల వివరాలు సమర్పించాలంటూ మహాబోధి ఆలయ పాలకమండలికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు బుద్ధగయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ (బీఎంటీసీ) ప్రతినిధి ఒకరు తెలిపారు. 64 ఏళ్ల క్రితం బుద్ధగయ ఆలయ చట్టం రూపొందిన తర్వాత ఈ ఆలయానికి ఆదాయపన్ను నోటీసు రావడం ఇదే తొలిసారి. ఈ విషయమై మంగళవారం నాడు ఆదాయపన్ను అధికారులతో భేటీ అయ్యి చర్చించనున్నట్లు బీఎంటీసీ సభ్య కార్యదర్శి ఎన్.దోర్జీ తెలిపారు. తాము కూడా చర్చించుకుని అప్పుడు నోటీసులకు సమాధానం పంపుతామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చే విరాళాల రూపంలో ఆలయానికి 2012-13 సంవత్సరంలో 6.29 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. -
'మహాబోధి' పేలుళ్ల కేసును వేగవంతం చేయండి
బుద్ద గయలోని మహాబోధి దేవాలయంలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై చేపట్టిన విచారణ మరింత వేగవంతం చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చీఫ్ శరత్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ, బీహార్ రాష్ట్ర పోలీసులతో ఆయన బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా కేసు పురోగతిపై శరత్‌కుమార్ ఆయా అధికారులతో చర్చించారు. అలాగే ఆ కేసులో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఎన్ఐఏ, బీహార్ పోలీసు ఉన్నతాధికారులు శరత్‌కుమార్‌కు ఈ సందర్బంగా వివరించారు. బీహార్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం బుద్ద గయలోని మహాబోధి దేవాలయం దేవాలయంలో పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన యాసిన్ భత్కల్‌కు ఈ పేలుళ్లతో సంబంధం ఉండవచ్చని శరత్ కుమార్ అనుమానించారు. అలాగే మావోయిస్టులు చర్య కావచ్చని దీన్ని తోసిపుచ్చుడానికి వీలు లేదన్నారు. జులై 7న మహాబోది దేవాలయంలో వరుసగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు బౌద్ధ బిక్షువులు గాయపడిన సంగతి తెలిసిందే. -
'మహాబోధి'భద్రతకు నెలకు రూ.50 లక్షలు!
బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుద్ద గయలోని మహాబోధి ఆలయానికి పటిష్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అమీర్ సుభాని బుధవారం పాట్నాలో వెల్లడించారు. ఆ ఆలయ భద్రత బాధ్యతలను ఇకపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల (సీఐఎస్ఎఫ్) సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు. 261 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ఆలయాన్ని పహరా కాస్తుంటారని చెప్పారు. అందుకోసం నెలకు రూ.50 లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది జీతభత్యాల కింద ఆ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తామని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర హోం శాఖకు నివేదికను సమర్పించినట్లు తెలిపారు. తుది నిర్ణయం రావాలసి ఉందని అన్నారు. ఈ ఏడాది జూలై 7న మహాబోధి ఆలయంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. దాంతో ఆ రాష్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని ప్రధానికి లేఖ రాశారు. అందుకు సంబంధించిన ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి షిండే ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్దుడు మహాబోధి దేవాలయంలోని వృక్షం కింద జ్ఞనోదయం పొందాడు. దీంతో దేశవిదేశాల నుంచి ఏటా వేలాది మంది పర్యాటకులు ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా 2002లో యూనెస్కో ఆ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. -
బుద్ధగయ పేలుళ్ల కేసులో పూజారి అరెస్టు
బీహార్‌లోని బుద్ధగయ మహాబోధి ఆలయంలో సంభవించిన పేలుళ్ల కేసులో ఓ పూజారిని అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అనూప్ బ్రహ్మచారి అనే పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్లు జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మచారిని రాష్ట్ర పోలీసుల సాయంతో ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది. అనూప్ బ్రహ్మచారిని ప్రస్తుతం భద్రతా కారణాల రీత్యా గయ పట్టణంలోని రాంపూర్ పోలీసు స్టేషన్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ఎన్ఐఏ బృందం విచారించనుంది. జూలై ఏడో తేదీన మహాబోధి ఆలయంలో జరిగిన పేలుళ్లలో మొత్తం పది బాంబులు పేలగా, మరో మూడింటిని ముందే గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బుద్ధగయ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది సహా పలువురిని ఎన్ఐఏ బృందాలు క్షుణ్ణంగా విచారించాయి. వినోద్ మిస్త్రి అనే అనుమానితుడితో సహా ఆరుగురిని ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. తాజాగా పూజారిని అరెస్టు చేసింది.