బీహార్లో ఇటీవల ఉగ్రవాదుల దాడికి గురైన మహాబోధి ఆలయానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది.
బీహార్లో ఇటీవల ఉగ్రవాదుల దాడికి గురైన మహాబోధి ఆలయానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ ఆలయానికి నోటీసులు జారీచేసింది. ఆలయ ఆదాయ, వ్యయాల వివరాలు సమర్పించాలంటూ మహాబోధి ఆలయ పాలకమండలికి ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు బుద్ధగయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ (బీఎంటీసీ) ప్రతినిధి ఒకరు తెలిపారు.
64 ఏళ్ల క్రితం బుద్ధగయ ఆలయ చట్టం రూపొందిన తర్వాత ఈ ఆలయానికి ఆదాయపన్ను నోటీసు రావడం ఇదే తొలిసారి. ఈ విషయమై మంగళవారం నాడు ఆదాయపన్ను అధికారులతో భేటీ అయ్యి చర్చించనున్నట్లు బీఎంటీసీ సభ్య కార్యదర్శి ఎన్.దోర్జీ తెలిపారు. తాము కూడా చర్చించుకుని అప్పుడు నోటీసులకు సమాధానం పంపుతామని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చే విరాళాల రూపంలో ఆలయానికి 2012-13 సంవత్సరంలో 6.29 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.