మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్ సందడి చేయనున్నాడు. బిహార్‌లోని పాట్నాలో నిర్వహించే భారీ ఈవెంట్‌లో పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. నగరంలోని గాంధీ మైదానంలో ఈవెంట్ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.
అయితే ఈవెంట్‌ను అక్కడి ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కేటాయించింది. అయితే ఒక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్‌కు నార్త్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
పాట్నా నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment