డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌  | Farmers Call For Bharat Bandh On December 8th | Sakshi
Sakshi News home page

పిలుపునిచ్చిన రైతులు

Published Fri, Dec 4 2020 6:17 PM | Last Updated on Fri, Dec 4 2020 8:18 PM

Farmers Call For Bharat Bandh On December 8th - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 8వ తేదీన దేశ వ్యాప్త బంద్‌ పాటించాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసేస్తామని ప్రకటించారు. (కెనడా ప్రధాని వ్యాఖ్యలు: భారత్‌ హెచ్చరిక!)

దేశ వ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్లను స్వాధీనపర్చుకుని టోల్‌ గేట్‌ ఫీజులు వసూలు చేసుకోకుండా అడ్డుకుంటామని చెప్పారు. ‘‘ ఈ ఉద్యమంలో మరికొంత మంది చేరతారు. విద్యుత్‌ ఛార్జీలు, పంట నష్టం విషయంలో ప్రభుత్వం మా డిమాండ్లను ఒప్పుకుంటుందో లేదో చూడాలి’’ అని నిరసనలు తెలుపుతున్న ఓ రైతు సంఘం నాయకుడు హరిందర్‌ సింగ్‌ లోఖోవాల్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement