
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)
కోల్‌కతా : పెట్రో భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ భారత్ బంద్‌పై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ప్రజలపై పెనుభారం మోపుతుండగా, ఇంధనంపై వ్యాట్ వసూలు చేస్తూ తృణమూల్ సర్కార్ పరిస్థితిని మరింత దిగజార్చిందని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.
బంద్‌కు పిలుపు ఇచ్చిన అంశాలను తాము సమర్ధిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంటూనే సమ్మెకు తాము వ్యతిరేకమని, భారత్ బంద్ సందర్భంగా జనజీవనం యధావిధిగా సాగేందుకు అన్ని చర్యలూ చేపడతామని పేర్కొంది.
సమ్మె కారణంగా ప్రజలకు అసౌకర్యం తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ్ ఛటర్జీ వెల్లడించారు. మరోవైపు భారత్ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఎన్‌సీపీ, ఎస్పీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment