పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వైద్యులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ వైద్యులు ‘టీ’ తాగేందుకు రావాలని కోరారు. అందుకు వైద్యులు ఒప్పుకోలేదు. అభయ ఘటనలో న్యాయం చేస్తేనే.. తాము టీ తాగేందుకు అంగీకరిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన ప్రతినిధి బృందంలోని డాక్టర్ అకీబ్ మాట్లాడారు. కాళీఘాట్ వద్ద చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ మమ్మల్ని వారి నివాసానికి పిలిచారు. ఆహ్వానం మేరకు మేం అక్కడి వెళ్లాం. విజ్ఞప్తి మేరకు వైద్యుల బృందానికి, సీఎం దీదీతో జరిపే చర్చలు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఆ తర్వాత సీఎం బయటికి వచ్చి టీ తాగమని మమ్మల్ని అభ్యర్థించారు. కాని జూనియర్ డాక్టర్లు మాకు న్యాయం చేస్తేనే టీ తాగుతామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పి వెనుదిరిగినట్లు అకీబ్ వెల్లడించారు.
కాగా, ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో అభయపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ కోల్‌కతా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలను విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చివరికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జూడాల సమ్మె కొనసాగుతుంది.
ఇదీ చదవండి : నేను ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది
Comments
Please login to add a commentAdd a comment