judas
-
‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వైద్యులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ వైద్యులు ‘టీ’ తాగేందుకు రావాలని కోరారు. అందుకు వైద్యులు ఒప్పుకోలేదు. అభయ ఘటనలో న్యాయం చేస్తేనే.. తాము టీ తాగేందుకు అంగీకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన ప్రతినిధి బృందంలోని డాక్టర్ అకీబ్ మాట్లాడారు. కాళీఘాట్ వద్ద చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ మమ్మల్ని వారి నివాసానికి పిలిచారు. ఆహ్వానం మేరకు మేం అక్కడి వెళ్లాం. విజ్ఞప్తి మేరకు వైద్యుల బృందానికి, సీఎం దీదీతో జరిపే చర్చలు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఆ తర్వాత సీఎం బయటికి వచ్చి టీ తాగమని మమ్మల్ని అభ్యర్థించారు. కాని జూనియర్ డాక్టర్లు మాకు న్యాయం చేస్తేనే టీ తాగుతామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పి వెనుదిరిగినట్లు అకీబ్ వెల్లడించారు.కాగా, ఆర్జీ కార్ ఆస్పత్రిలో అభయపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ కోల్‌కతా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలను విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చివరికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జూడాల సమ్మె కొనసాగుతుంది.ఇదీ చదవండి : నేను ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్‌తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించం: కామినేని
విజయవాడ : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జూడాల సమ్మెను ప్రజలెవ్వరూ హర్షించడం లేదని, వారు సమ్మె విరమించి చర్చలకు రావాలని కామినేని సూచించారు. కాగా గ్రామీణ సర్వీసు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 107ను రద్దు చేయాలని, ఆ సర్వీసును కంపల్సరీగా కాకుండా వలంటరీ సర్వీసుగా మార్పుచేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేస్తున్న సమ్మె అయిదో రోజూ కొనసాగుతోంది. మరోవైపు మంత్రి కామినేని శ్రీనివాస్ వైఖరికి నిరసనగా నేటి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలకూ గైర్హాజరయ్యారు.