సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి హెచ్చరించారు.
విజయవాడ : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జూడాల సమ్మెను ప్రజలెవ్వరూ హర్షించడం లేదని, వారు సమ్మె విరమించి చర్చలకు రావాలని కామినేని సూచించారు.
కాగా గ్రామీణ సర్వీసు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 107ను రద్దు చేయాలని, ఆ సర్వీసును కంపల్సరీగా కాకుండా వలంటరీ సర్వీసుగా మార్పుచేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేస్తున్న సమ్మె అయిదో రోజూ కొనసాగుతోంది. మరోవైపు మంత్రి కామినేని శ్రీనివాస్ వైఖరికి నిరసనగా నేటి నుంచి తిరుపతి రుయా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలకూ గైర్హాజరయ్యారు.