ఏపీలో సమ్మె విరమించిన జూడాలు | junior doctors call off strik in AndhraPradesh state | Sakshi
Sakshi News home page

ఏపీలో సమ్మె విరమించిన జూడాలు

Published Thu, Dec 4 2014 10:21 PM | Last Updated on Sat, Jun 2 2018 2:59 PM

junior doctors call off strik in AndhraPradesh state

విజయవాడ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో గురువారం గుంటూరు జిల్లా తెనాలిలో జూడాలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆ చర్చలు సఫలమైనాయి. దాంతో తమ సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.

ఏడాది రూరల్ సర్వీస్ నిబంధనను వ్యతిరేకిస్తూ జూడాలు నవంబర్ 3న సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జూడాలు... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అవి విఫలం కావడంతో  గురువార మరో దఫా చర్చలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement