ఏపీలో సమ్మె విరమించిన జూడాలు
విజయవాడ : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో గురువారం గుంటూరు జిల్లా తెనాలిలో జూడాలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆ చర్చలు సఫలమైనాయి. దాంతో తమ సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.
ఏడాది రూరల్ సర్వీస్ నిబంధనను వ్యతిరేకిస్తూ జూడాలు నవంబర్ 3న సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జూడాలు... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అవి విఫలం కావడంతో గురువార మరో దఫా చర్చలు జరిపారు.