టీఎంసీ నేతపై అటాక్‌ ప్లాన్‌.. సీన్‌ రివర్స్‌ కావడంతో.. | Trinamool Leader Chases Shooter Dramatic visuals At Kolkata | Sakshi
Sakshi News home page

టీఎంసీ నేతపై అటాక్‌ ప్లాన్‌.. సీన్‌ రివర్స్‌ కావడంతో..

Published Sat, Nov 16 2024 12:33 PM | Last Updated on Sat, Nov 16 2024 1:15 PM

Trinamool Leader Chases Shooter Dramatic visuals At Kolkata

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. అధికార టీఎంసీ నేతను టార్గెట్‌ చేసి దుండగులు చంపే ప్రయత్నం చేయగా.. ప్లాన్‌ విఫలమైంది. దీంతో, సదరు నేత.. వారికి పట్టుకోవడంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన బెంగాల్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వివరాల ప్రకారం.. టీఎంసీ నేత సుశాంత ఘోష్ కోల్‌కత్తా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 108 వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్నాడు. సుశాంత.. శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం, ఇంటి బయటే వారందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు షూటర్లు బైక్‌పై వచ్చి సుశాంతను తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి తన జేబులో నుంచి తుపాకీ తీసి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు.

అయితే, అది పనిచేయకపోవడంతో మరోసారి కాల్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అది మొరాయించింది. అప్పటికి తేరుకున్న సుశాంత వెంటనే లేచి అతడిని పట్టుకున్నాడు. అక్కడే ఉన్న మరికొందరు టీఎంసీ నేతలు కూడా అలర్ట్‌ అయ్యి.. వారిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం, వారిని ఎవరు పంపారని ప్రశ్నించగా.. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదని, ఫొటో ఇచ్చి చంపమని అడిగారని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.

దీంతో, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌన్సిలర్‌ను చంపేందుకు బీహార్ నుంచి కిల్లర్లను రప్పించినట్టు విచారణలో తేలింది. దీని వెనుక స్థానిక ప్రత్యర్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, తనను చంపేందుకు ప్లాన్ చేసిన వారు ఎవరో తెలియదని కౌన్సిలర్ పేర్కొన్నారు. తాను పుష్కర కాలంగా కౌన్సిలర్‌గా ఉన్నానని, తనపై దాడి జరుగుతుందని ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు. తన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement