
సాక్షి, ఛత్తీస్‌గఢ్: సుక్మాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఐదుగురు మావోయిస్టులను పట్టుకున్న పోలీసులు.. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెద్దసంఖ్యతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు కోసం అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment