ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ | Maoist Top Leader RK Funerals Performed At Telangana Border Photos Released | Sakshi
Sakshi News home page

ఆర్కే అంత్యక్రియలు.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

Published Sat, Oct 16 2021 3:32 PM | Last Updated on Sat, Oct 16 2021 4:42 PM

Maoist Top Leader RK Funerals Performed At Telangana Border Photos Released - Sakshi

సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసింది.

తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపింది. పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించిన ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి  నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement