ఆరిలోవ (విశాఖ తూర్పు): మావో యిస్టు నేత కోబడ్ గాంధీ మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు విశాఖ పోలీసులు గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి విశాఖపట్నం జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులన్నీ మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినవే.
ఇంగ్లండ్‌లో సీఏ చదివి..
కోబడ్ గాంధీ ముంబైలో ధనిక పార్సీ కుటుంబంలో జన్మించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీతో కలిసి డెహ్రాడూన్ యూనివర్సిటీలో పీజీ చదివారు. ఇంగ్లండ్‌లో సీఏ అభ్యసించారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్య మరణించడంతో కుటుంబాన్ని వదిలేసి మావో యిస్టు ఉద్యమంలోకి వచ్చారు. కాగా, తనపై ఎనిమిది కేసు లున్నాయని, ఎనిమిదేళ్లపాటు వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవించానని కోబడ్ గాంధీ తెలిపారు. తీహార్ జైల్లో ఏడేళ్లు, చర్లపల్లి జైల్లో్ల నాలుగు నెలలు, విశాఖ జైల్లో్ల తొమ్మిది నెలలు ఉన్నట్లు చెప్పారు. వీటి న్నింటికంటే విశాఖ జైల్ బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment