
గొర్రెలమెట్ట అడవిలో ఎన్‌కౌంటర్
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని గొర్రెలమెట్ట అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్లో
మావోయిస్టు నేత జాంబ్రితో పాటు మరొకరు మృతి
గూడెంకొత్తవీధి/కొయ్యూరు (పాడేరు): విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని గొర్రెలమెట్ట అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు నేత జాంబ్రి (గెమ్మిలి నారాయణరావు), దళ సభ్యుడు చిట్టిబాబు అలియాస్ కిషోర్ మరణించారు. మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీలో జాంబ్రి డివిజినల్ మెంబర్‌గా ఉన్నాడు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంలో పోలీసులు తమ ప్రణాళికను అమలు పరిచారు.
జాంబ్రి స్వగ్రామం జీకేవీధి మండలం మెట్టిగూడ. ఇతనిపై ప్రభుత్వ ం రూ. 4 లక్షల రివార్డు ప్రకటిం చింది. 2008లో జరిగిన బలిమెల ఘటనలో జాంబ్రి కీలక పాత్ర పోషించాడు. కాగా గొర్రెలమెట్ట గ్రామానికి చెందిన గోపాలరావునూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక థాంప్సన్ సబ్‌మెషీన్ గన్‌తో పాటు ఒక షాట్ గన్, డిటోనేటర్లు, స్వాధీనం చేసుకు న్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు.