ప్రముఖ మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పండాపై పోలీసులు పెట్టిన కేసును ఒడిషాలోని ఓ స్థానిక కోర్టు కొట్టేసింది. ఈ కేసులో పండాను నిర్దోషిగా విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం గోషానినుగావ్ పోలీసు స్టేషన్లో ఆయుధాల చట్టం కింద పండాపై కేసు నమోదైంది. అయితే, పండాపై ఈ కేసులో ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ బెహరా కేసును కొట్టేశారు.
ఒడిషాలోని వివిధ కోర్టుల్లో పండాపై వందకు పైగా కేసులు ఉండగా.. ఈ ఒక్క కేసులోనే ఇప్పటివరకు ఆయనకు సానుకూలంగా తీర్పు వచ్చిందని పండా తరఫు న్యాయవాది దీపక్ పట్నాయక్ తెలిపారు. ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా నిర్దోషులుగా విడిచిపెట్టిన కోర్టు.. మరో వ్యక్తి మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారంటు జారీచేసింది.
మావోయిస్టు నేత సవ్యసాచి పండాపై కేసు కొట్టివేత
Published Wed, Jul 1 2015 7:48 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement
Advertisement