ఇప్పటికైనా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే లొంగిపోయి సరైన వైద్యం చేయించుకోవాలని ఒడిశా పోలీసులు కోరారు. వైద్య సేవలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆర్కే గాయపడ్డారని, ఆయన కాళ్లకు గాయాలయ్యాయని, ఇప్పటికైనా లొంగిపోయి శస్త్ర చికిత్సలాంటివి చేయించుకోవచ్చని మల్కన్ గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఆయన ఒడిశా -ఆంధ్ర సరిహద్దులోని ఏదో గుర్తు తెలియన వైద్య శిబిరంలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అన్నారు.