మాపై ఎటువంటి ఒత్తిడి లేదు | Maoist Leader Jampanna Comments | Sakshi
Sakshi News home page

మాపై ఎటువంటి ఒత్తిడి లేదు

Published Mon, Dec 25 2017 1:21 PM | Last Updated on Mon, Dec 25 2017 2:41 PM

 Maoist Leader Jampanna Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాము లొంగిపోవడానికి సైద్ధాంతిక విభేదాలే కారణమని మావోయిస్టు నేత జంపన్న తెలిపారు. తమ లొంగుబాటు వెనుక ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ లైన్‌ ప్రకారం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామని చెప్పారు. పీపుల్స్‌వార్‌, మావోయిస్టుల లైన్‌ ఆ పరిస్థితుల్లో సరైందేనని.. గత 15 ఏళ్లలో దేశంలో అనేక సామాజిక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధ భూస్వామ్య పద్ధతి సరికాదని.. ఇప్పుడు భూస్వాములు లేరు, ఇప్పుడా భూస్వామ్య వ్యవస్థ కూడా లేదన్నారు.

ప్రజలతో కలిసి పనిచేయడంలో మావోయిస్టు పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, కాలానికి అనుగుణంగా మారలేకపోయిందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిప్రాయాలపై కమిటీతో నిర్దిష్టంగా చర్చించలేకపోయానని, అందుకే కేంద్ర కమిటీకి లేఖ రాసి బయటకు వచ్చానని వెల్లడించారు. తన ఆలోచనకు అనుగుణంగా పార్టీని మార్చడం సాధ్యం కాదని తెలుసుకుని, సాధారణ జీవితం గడపటానికి బయటకు వచ్చానని చెప్పారు.

జంపన్న భార్య రజిత వరంగల్‌ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇచ్చేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు.

మాపై ఎటువంటి ఒత్తిడి లేదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement