rajitha
-
పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా హేమ, సురేఖవాణి!
-
శెభాష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ జాతీయ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం తెలంగాణ మహిళా అథ్లెట్స్ అగసార నందిని స్వర్ణం, జీవంజి దీప్తి రజతం... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజ రజిత కాంస్యం సాధించారు. గుజరాత్లో జరుగుతున్న ఈ మీట్లో నందిని 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.97 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఈ ప్రదర్శనతో నందిని కొలంబియాలో ఆగస్టు 1 నుంచి 6 వరకు జరిగే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. దీప్తి 100 మీటర్ల ఫైనల్ రేసును 12.17 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. రజిత 400 మీటర్ల ఫైనల్ రేసును 56.32 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. నందిని, దీప్తి, రజిత హైదరా బాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సాయ్’ కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ పొందుతున్నారు. చదవండి: Rafael Nadal: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
Kunja Rajitha: స్వర్ణం సాధించిన రజిత గురించి ఈ విషయాలు తెలుసా?
Kunja Rajitha: జాతీయ ఓపెన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కుంజా రజిత స్వర్ణ పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన అండర్–20 మహిళల 400 మీటర్ల ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిత 56.19 సెకన్లలో అందరికంటే ముందు గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. కిరణ్‌జ్యోత్ (పంజాబ్; 57.02 సెకన్లు) రజతం, ప్రిసిలా (కేరళ; 57.54 సెకన్లు) కాంస్యం సాధించారు. వలస వచ్చి.. కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురానికి 35 ఏళ్ల ఏళ్ల క్రితం వలసవచ్చింది కుంజా మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. మారయ్య- భద్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు ..ఇద్దరు అమ్మాయిలు. వీరిలో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోవడంతో బాధ్యతంతా భద్రమ్మపై పడింది. ఆమె అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తోంది. ఇక... రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి విద్యనభ్యసించేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదువుకుంది. సెలవులు ఉన్నప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి రజితలోని వేగాన్ని ఆమె పెద్దన్న జోగయ్య గమనించాడు. ఆగని పరుగు.. ఈ క్రమంలో... నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్ చదువుతూ గుంటూరులో శాప్ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది. ఇప్పుడు జాతీయ ఓపెన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది. చదవండి: DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు? T20 World Cup 2021: టీమిండియా నెట్ బౌలర్‌గా ఆవేశ్‌ఖాన్ -
మూడు పొరల మాస్కులు ఉచితంగా ఇస్తున్నా
కష్టాలు అడ్డంకులను అధిగమించేలా చేస్తాయి కష్టాలు జీవితం పట్ల అవగాహన పెంచుతాయి కష్టాలు ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్పుతాయి యాభై ఏళ్ల రజితారాజ్ను కలిస్తే సమస్యలను అధిగమించే నేర్పుతో పాటు, ఇతరులకు సాయపడే గుణాలను ఎలా అలవరచుకోవచ్చో తెలుస్తోంది. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న యాభై ఏళ్ల రజితారాజ్ స్వయంగా టైలరింగ్ నేర్చుకుని, దానినే ఉపాధిగా మలుచుకుని, కుటుంబం నిలదొక్కుకునేలా చేసింది. సమస్యలతో పోరాటం చేస్తున్న మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది. రోజూ కాస్త తీరిక చేసుకొని వందకు పైగా మాస్కులు కుట్టి, తన బొటిక్‌లోని టేబుల్ మీద ఉంచుతుంది. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకెళ్లచ్చు. బస్తీ వాసులకు, పేదలకు అలా ఉచితంగా మాస్కులు పంచుతూ కరోనా కట్టడికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్న రజితారాజ్ తన స్వయంకృషి ని ఇలా మన ముందుంచారు. స్వీయ శిక్షణ ‘‘మాది వరంగల్. ఇంటర్ఫస్టియర్లో ఉండగానే పెళ్లయ్యింది. ఇరవై ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబ పోషణకు ఏదైనా పనిచేయక తప్పనిస్థితి ఎదురైంది. ఏ పని చేయాలో ముందు దిక్కుతోచలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ టైలరింగ్ చేస్తుంటే చూసి నేనూ కొంత నేర్చుకున్నాను. వారపత్రికల్లో వచ్చే డ్రెస్ డిజైన్స్ చూసి, ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఏం పని చేయగలనా అని ఆలోచించినప్పుడు మా నాన్నను అడిగితే కుట్టుమిషన్ కొనిచ్చారు. చుట్టుపక్కల వాళ్లకు బ్లౌజులు కుట్టేదాన్ని. అక్కణ్ణుంచి నోటి మాట ద్వారా ‘రజిత బాగా డ్రెస్ డిజైన్ చేస్తుంది’ అనే పేరొచ్చింది. ఇంటి నుంచే చుట్టుపక్కల లేడీస్‌కి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆన్లైన్ లో నా డ్రెస్ డిజైన్స్ పెట్టాను. అక్కణ్ణుంచి ఆర్డర్స్ పెరిగాయి. ఏడుగురు మహిళలే.. మా కుటుంబసభ్యుల పేర్లలో మొదటి అక్షరం తీసుకొని, వాటిని కలిపి ‘చర్ప్స్’ అని బొటిక్ పెట్టాను. నేను పని నేర్పించిన వారినే ఎంప్లాయీస్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడు పద్నాలుగు మంది పనివారున్నారు. అందులో ఏడుగురు మహిళలే. ముప్పై ఏళ్లు పిల్లల కోసమే బతికాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. జీవితాల్లో స్థిరపడ్డారు. నేను తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంత మేలు చేసిందో పిల్లలు చెబుతుంటే సంతోషం గా అనిపిస్తుంటుంది. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆడవారే త్వరగా మేలుకుంటారు. వచ్చిన ఏ చిన్న పని చేసైనా పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలనుకుంటారు. నాకు కొద్దిగా వచ్చిన టైలరింగ్‌నే ఉపాధిగా మార్చుకున్నాను. ఇప్పుడు కొందరికి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న విద్యార్థులూ నా వద్ద వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు. టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు నేర్పిస్తాను. అయితే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇది స్కూల్‌గా రిజిస్టర్ కాలేదు. సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్‌కి డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాను. ఉచితంగా మాస్కులు.. ఇదో పెద్ద సాయం అనుకోను. వచ్చిన పనే నలుగురికి ఉపయోగపడితే చాలనుకుంటాను. కరోనా మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు ఇచ్చి చేతనైన సాయం చేస్తున్నాను. మాస్కుల తయారీకి కాటన్ పన్నాలు కొనుక్కొచ్చి, మూడు పొరల మాస్కులు తయారు చేసి టేబుల్ మీద పెడుతుంటాను. ఎవరికి అవసరమున్నా అడిగి తీసుకెళుతుంటారు. అనాథ, వృద్ధాశ్రమాలకు ఉచితంగా మాస్కులు ఇచ్చి వస్తుంటాను. ఇప్పుడు వేడుకల సందర్భాల్లో మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ మాస్కులు వాడుతున్నారు. వాటి ఆర్డర్లతో పాటు ఈ ఉచిత మాస్కుల తయారీ కూడా ఉంటుంది’ అని వివరించారు రజితారాజ్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..!
ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది? అని ఎవరైనా అనుకుంటూ ఉంటేæవారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లేనంటున్నారు యువ మహిళా రైతు రజిత! రసాయనాలు వాడకుండా, ఒకటికి పది–పదిహేను పంటలు పండిస్తే.. చిన్న కుటుంబం ఆనందంగా జీవించడానికి ఎకరం భూమి ఉన్నా చాలని రుజువు చేస్తున్నారామె. 8 ఏళ్లుగా ఆదర్శ సేద్యం చేస్తూ తోటి రైతులకు వెలుగు బాట చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు ఏడాది పొడవునా పలు పంటల విధానాన్ని అనుసరిస్తూ సేద్యాన్ని సంతోషదాయకంగా మార్చుకోవడమే కాకుండా ఇతర రైతులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడుకు చెందిన కె.రజిత(27). 19 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పెళ్లవడంతో చదువు ఆగిపోయింది. ఆ దశలో డ్రాక్రా గ్రూపులో చేరిన రజిత విష రసాయనాల్లేని వ్యవసాయం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్)లో శిక్షణ పొంది తమ కున్న ఎకరం నల్లరేగడి భూమిలో విభిన్నంగా పంటలు పండించడం ప్రారంభించారు. 2012లో ఎన్‌పిఎం వ్యవసాయంలో విలేజ్ యాక్టివిస్టుగా చేరి.. తాను వ్యవసాయం చేసుకుంటూ తమ గ్రామంలో ఇతర రైతులకూ ఈ సేద్యాన్ని నేర్పించేందుకు కృషి చేశారు. తదనంతర కాలంలో పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమంలో క్లస్టర్ యాక్టివిస్టుగా బాధ్యతలు తీసుకొని ఐదుగురు సిబ్బంది తోడ్పాటుతో మూడు గ్రామాల్లో ప్రకృతి సేద్య విస్తరణకు కృషి చేస్తున్నారు. తమ ఎకరం పొలంలో ఆదర్శవంతంగా ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఎన్‌పిఎం సాగుతో ప్రారంభం మెట్ట ప్రాంతమైన నాగులుప్పలపాడు రబీ మండలం కావడంతో రైతులు ఎక్కువగా రసాయనిక వ్యవసాయంలో పుల్ల శనగను పండిస్తూ ఉంటారు. రజిత ఎన్‌పిఎం సేద్యం చేపట్టినప్పుడు పురుగుమందులు వాడకుండా వ్యవసాయం ఎట్లా అవుతుందని రైతులు ఎద్దేవా చేసేవారు. కానీ, క్రమంగా ఆమె మెళకువలను అలవరచుకొని ముందుకు సాగడంతో వారే ముక్కున వేలేసుకున్నారు. మూడేళ్లుగా కూరగాయ పంటలను సైతం అంతరపంటలుగా సాగు చేసుకుంటున్నారు రజిత. గత నాలుగైదేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ప్రధాన పంటతోపాటు అనేక అంతర పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారామె. ఎన్ని రకాల పంటలు సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించటమే ప్రధాన ధ్యేయం. జీవామృతం, పంచగవ్య, కషాయాలను పంటలపై పిచికారీ చేస్తారు. ఎకరానికి 400 కిలోల ఘన జీవామృతం తయారు చేసుకొని పంటలకు సకల పోషకాలను అందిస్తున్నారు. మిత్ర పురుగులు వృద్ధి చెంది చీడపీడల బెడద నష్టదాయకంగా పరిణమించకుండా కాపాడుతున్నాయి. 10 రకాల అంతరపంటలు ప్రధాన పంట మిరపలో అంతర పంటలుగా 10 రకాలు సాగు చేసి మంచి ఫలితాలు సాధించింది. మిరప పంట ఆరు నెలల కాల వ్యవధిలో కాపు ముగుస్తుంది. ఈ లోగా మూడు నెలలు, రెండు నెలలు, నాలుగు నెలల కాల వ్యవధిలో ఉండే పంట రకాలను ఎంచుకొని సాగు చేపట్టింది. మిరప పంటకు చుట్టూ బెల్టుగా కంది పంటను సాగు చేసింది. కందితో పాటు ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర, మొక్కజొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమోటా, ఎర పంటలుగా బంతి, ఆముదం కూడా సాగు చేపట్టింది. ఏడాది పొడవునా పంటలు 2017 ఏప్రిల్ నుంచి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిలో నవధాన్యాలను ఎండాకాలంలోనే వెదజల్లి పచ్చి రొట్ట పంటలు సాగు చేసి కలియదున్ని.. తదనంతరం పంటలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఏడాది పొడవునా పొలాన్ని ఖాళీగా ఎండబెట్టకుండా ఏదో ఒక పంట లేదా పచ్చిరొట్ట పంటలు సాగులో ఉంటాయి. దీంతో భూమి గుల్లబారి భూసారం మరింత పెరగడంతోపాటు.. మిర్చి ప్రధాన పంటగా సాగు చేస్తుండగా ఇతర రైతులతో పోల్చితే చీడపీడల బెడద తమ పొలంలో చాలా తక్కువగా ఉందని, దిగుబడుల పరిమాణం, నాణ్యత కూడా బాగా పెరిగాయని రజిత తెలిపారు. మిర్చితోపాటు కొందరు రైతులు ఉల్లిని అంతర పంటగా వేశారని, తాను మిర్చితోపాటు వేసిన ఉల్లిపాయ ఒక్కొక్కటి పావు కిలో తూగితే, రసాయనిక వ్యవసాయం చేసే ఇతరుల పొలాల్లో ఉల్లి మధ్యస్థంగా పెరిగిందన్నారు. సాగు వ్యయం సగమే ప్రకృతి వ్యవసాయంలో ఎకరం పొలంలో ఎండు మిర్చితోపాటు పలు అంతర పంటలు సాగు చేయడానికి రజిత ఇప్పటి వరకు అన్ని ఖర్చులూ కలిపి రూ. 62,550 ఖర్చు పెట్టారు. మిర్చి సాగు చేసే ఇతర రైతులకు కనీసం రూ. 1,10,000 అయ్యిందని రజిత తెలిపారు. మిర్చి తొలి కోతలో ఎకరానికి 4.5 క్వింటాళ్లకు పైగా ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. ధర క్వింటాకు రూ. 14,500 ఉండగా తమ పంటను రూ. 16,000కు అడిగారని, అయినా ధర పెరుగుతుందన్న భావనతో కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టానని రజిత వివరించారు. మొత్తంగా 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతరపంటల అమ్మకం ద్వారా రూ. 35 వేలు ఆదాయం వచ్చిందన్నారు. ఖర్చులన్నీ పోను రూ. 2.30 లక్షలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని రజిత లెక్కగడుతున్నారు. ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా కుటుంబానికి రసాయనిక అవశేషాల్లేని ఆహారాన్ని అందించడంతోపాటు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తున్న రజిత.. మరో వైపు చదువును సైతం కొనసాగిస్తున్నారు. దూరవిద్య ద్వారా బీకాం చదువుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ సంతోషంగా ఉన్నారని రజిత సంతోషపడుతున్నారు. హేళన చేసిన వారే అనుసరిస్తున్నారు..! నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన కొత్తలో గ్రామంలోని చాలా మంది రైతులు హేళన చేసేవారు. చిన్న అమ్మాయి ఏమి తెలుసని అనేవారు. 2012 నుంచి పురుగుమందుల్లేని వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలోని మెళకువలను అధ్యయనం చేసి, నా ఎకరం పొలంలో ఆచరిస్తున్నాను. ఇవే నన్ను ఆత్మస్థయిర్యంతో ముందుకు నడిపించాయి. జీవామృతంతో పంటలు పండించే విధానాన్ని 2, 3 ఏళ్ల పాటు రైతులు మా పొలంలో చూసి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో తగ్గిన ఖర్చులు చూసి రసాయన ఎరువులు, పురుగుమందులతో పంటలు సాగు చేసే రైతులు నివ్వెరపోయారు. వాళ్ళు 2, 3 రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణించిపోతున్నది. ప్రకృతి వ్యవసాయమే అన్ని విధాలా మంచిది. – కె.రజిత (76740 21990), యువ ప్రకృతి వ్యవసాయదారు, నాగులుప్పలపాడు, ప్రకాశం జిల్లా – ఎన్.మాధవరెడ్డి, సాక్షి ప్రతినిధి, ఒంగోలు ఫొటోలు: ఎమ్. ప్రసాద్, సీనియర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం
సాక్షి, శంకరపట్నం: ప్రేమే ప్రాణమనుకున్న రజితకు..ప్రేవిుంచిన భర్త వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేయడంతో నాలుగునెలల చిట్టితల్లిని వదిలి చితిపైకి వెళ్లింది. ఈ సంఘటన పలువురిని కలిచివేసింది. వివరాలు ఇలా.. శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజితకు పుట్టినప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. పుట్టిన రెండు, మూడురోజులకే తల్లి స్వరూప కన్నుమూసింది. తండ్రి నర్సయ్య ఊళ్లో పశువుల కాపరీగా పనిచేసి కూతురు ఆలనాపాలన చూసేవాడు. కొన్నేళ్లకు రజిత తండ్రి నర్సయ్య పద్మను రెండో వివాహం చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న క్రమంలో గద్దపాక వాగులోని బావిలో ప్రమాదవశాత్తు పడి రజిత తండ్రి నర్సయ్య పదేళ్లక్రితం మృతిచెందాడు. పినతల్లి పద్మ రజితను ఉన్నత చదువులు చదివించింది. రజిత పెళ్లినాటి ఫోటో ఈ క్రమంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న చోట మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ప్రేమగా మారింది. నాలుగుమాసాలక్రితం రజిత ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొన్నినెలలుగా రజిత అనారోగ్యానికి గురికాగా వారంక్రితం భూతవైద్యుడు దొగ్గల శ్యామ్‌ను తీసుకువచ్చారు. భూతవైద్యం పేరుతో రజితకు దయ్యం పట్టిందని తలవెంట్రుకలు పట్టుకుని విచక్షణరహితంగా కొడుతూ మంచంపై పడేయడంతో తలకు గాయమైంది. ఐదురోజులక్రితం కరీంనగర్ ప్రైవేట్ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్సచేస్తుండగా సోమవారం అర్థరాత్రి మృతిచెందింది. (పెళ్లింట భారీ చోరీ) గద్దపాకలో అంత్యక్రియలు మంచిర్యాల జిల్లా కుందారంలో భూతవైద్యానికి బలైన రజిత అంత్యక్రియలు శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో పుట్టిన ఊరిలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. భూతవైద్యంతో రజిత ప్రాణాలు బలిగొన్న అత్తింటివారితోపాటు భూతవైద్యుడికి సహకరించిన బాబాయ్ రవీందర్‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, రజిత మృతదేహానికి సివిల్‌ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని గద్దపాకకు తీసుకురాగా హత్యానేరంతో అత్తింటి వారు రాకపోవడంతో పినతల్లి, స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. భూతవైద్యుడి చేతిలో ప్రాణాలు వదిలిన రజిత అంత్యక్రియల్లో మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. నాలుగునెలల చిన్నారి అనాథగా మారిందని పలువురు కంటతడిపెట్టారు. -
భూతవైద్యం పేరిట బాలింతకు చిత్రహింసలు
జైపూర్ : భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో ఓ బాలింతను మాంత్రికుడు వైద్యం పేరిట హింస పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వైపు ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు.. మరోవైపు చేతబడులకు గురైందన్న నెపంతో బాలింత అని కూడా చూడకుండా చిత్రహింసలు గురి చేయడం సంచలనం రేపింది. మాంత్రికుడి దెబ్బలకు యువతి స్పృహ కోల్పోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో మూడు నెలల పసికందు ఆ తల్లికి దూరమైంది. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత గర్భిణి అయినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు పలు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమె కొంత వింతగా ప్రవర్తిస్తోందని సమాచారం. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన మల్లేశ్ కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ విషయం రజిత బాబాయ్ జమ్మికుంట మండలం శ్యాంపేట్‌కు చెందిన రవీందర్‌కు తెలియడంతో ఆయన దొంగల శ్యామ్ అనే భూత వైద్యుడిని ఆశ్రయించాడు. సదరు భూత వైద్యుడు మల్లేశ్ ఇంటికొచ్చి రజిత చేతబడులకు గురైందని, ఆమెతో పూజ చేయించి నయం చేస్తానని నమ్మబలికాడు. బాలింత అని కూడా చూడకుండా తల వెంట్రుకలు పట్టుకుని ఇష్టారీతిన కొట్టడంతో రజిత సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగుతిన్న కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడామె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జైపూర్ ఏసీపీ భూపతి నరేందర్ ఆదేశంతో ఓ పోలీసు బృందం మల్లేశ్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
అరుదైన ఘనత సాధించిన మరో గిరిపుత్రిక
అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించింది మాలోత్ పూర్ణ. ఆమె బాటలోనే మరో గిరిజన యువతి పర్వతారోహణలో అవార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. పూర్ణనే తనకు ఆదర్శం అని చెబుతున్న మాలోత్ రజిత ఇటీవలే కిలిమంజరో పర్వతాన్ని సునాయసంగా అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగురవేసింది. ఇప్పుడు ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మారుమూలన ఉన్న సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రజిత మెదక్ జిల్లాలోని కొల్చారం గురుకుల డిగ్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచి ఆటల్లో ముందున్న రజిత డిగ్రీలో చేరిన తరువాత పర్వతారోహణలతో రికార్డు సృష్టించిన పూర్ణ విజయగాధను చూసి తను కూడా ఆమె అంత ఎత్తుకు ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ 60 మందిని ఎంపిక చేశారు. అందులో రజిత ఒకరు. భువనగిరిలో శిక్షణ ఇప్పించారు. అరవై మందిలో 16 మందిని ఎంపిక చేసి జమ్ము కాశ్మీర్‌లోని సిల్క్రూట్పాస్ (కార్దుంగ్లా)కు తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి రజితతో పాటు లక్ష్మి అనే యువతినీ ఎంపిక చేశారు. ఇద్దరినీ గత జనవరి నెలలో టాంజానియాకు తీసుకువెళ్లారు. జనవరి 19న కిలిమంజారో పర్వతం ఎక్కడం మొదలై 23 కు పూర్తి చేశారు. 5,895 మీట్ల ఎత్తుకు ఎక్కి భారత పతాకాన్ని ఎగురవేశారు. వ్యవసాయ కుటుంబం సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ కుబియా–జీరి దంపతుల కుమార్తె రజిత ఐదో తరగతి వరకు ఎక్కపల్లితండా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్లారెడ్డిలోని కస్తూరిబా విద్యాలయంలో, ఇంటర్ మెదక్‌లోని ఓ ప్రై వేటు కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారంలోని గురుకుల కళాశాలలో బీఎస్సీ బీజడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా రజిత తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. వారికి నలుగురు కుమారులు కాగా వారంతా వ్యవసాయంలోనే ఉన్నారు. రజిత ఒక్కతే చదువుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే రజిత ఆటల్లో ముందువరుసలో ఉండేది. కబడ్డీతో పాటు రన్నింగ్‌లోనూ దూకుడుగా ముందుకు సాగేది. రాష్ట్ర స్థాయిలో పది కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని అవార్డులు పొందింది. ఏడు పర్వతాల అధిరోహణ కల పూర్ణ ఎవరెస్టు ఎక్కిన తరువాత తనకు కూడా పర్వతాలు అధిరోహించాలన్న కోరిక బలంగా కలిగిందని రజిత చెబుతోంది. గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీన్‌కుమార్ ప్రోత్సాహంతో తాను కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించింది. అలాగే తన కుటుంబ సభ్యులతో పాటు కొల్చారం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతీదేవీలు ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాబోయే సెలవుల్లో ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొంది. ఏడు పర్వతాలు అదిరోహించడమే తన లక్ష్యమని చెబుతోంది. క్రీడాకారులను తయారు చేస్తా ఏడు పర్వతాలు అధిరోహించిన తరువాత బీపీఈడీ పూర్తి చేస్తా. పీఈటీగా ఉద్యోగం చేయడంతో పాటు క్రీడాకారులను తయారు చేయడానికి స్పోర్ట్స్ స్కూల్ నడపాలన్నది నా కోరిక. లక్ష్య సాధనలో ఎలాంటి ఒత్తిడి, కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు నడుస్తా. స్వేరోస్ కమిటీ, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల సహకారం మరువలేనిది. కష్టమైన పని కావడం వల్ల అమ్మ వద్దంటున్నా నాన్న, అన్నలు ప్రోత్సహిస్తున్నారు. వారందరి ప్రోత్సాహంతో ఎవరెస్టునూ అధిరోహిస్తా. – మాలోత్ రజిత, పర్వతారోహిణి -
కీర్తి కేసు.. ఒక్కో దాంట్లో ఒక్కో ‘పాత్ర’
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంసృష్టించిన తల్లిని చంపిన తనయ కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో దాదాపు వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదై... ఆ తర్వాత మలుపులు తిరుగుతూ మూడు కేసులుగా మారిందీ వ్యవహారం. వీటిలోని ఒక్కో కేసులో కీర్తి ‘పాత్ర’ ఒక్కో రకంగా ఉంది.మొత్తమ్మీద అక్టోబర్ 26న రాత్రి 8గంటలకు ఫిర్యాదు దారుగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కీర్తి... ఆపై అనుమానితురాలిగా, నిందితురాలిగా మారి బాధితురాలిగానూ ‘అవతారం’ ఎత్తింది. తొలుత ఫిర్యాది బాయ్‌ఫ్రెండ్ శశికుమార్ ప్రోద్బలంతో కీర్తి అక్టోబర్ 19న తల్లి రజితను హత్య చేసింది. 22 వరకు శవాన్ని ఇంట్లోనే ఉంచి, ఆపై శశితో కలిసి రామన్నపేటకు తీసుకెళ్లి అక్కడి రైలు పట్టాలపై పడేసింది. తన తండ్రి వేధింపుల నేపథ్యంలోనే తల్లి ఎక్కడికో వెళ్లిపోయిందంటూ 26న రాత్రి 8గంటలకు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నెం.643/2019గా నమోదైన ఈ మిస్సింగ్ కేసులో కీర్తి ఫిర్యాదిగా, ఆమె తల్లి రజిత పేరు బాధితురాలిగా ఉంది. ఆపై అనుమానితురాలు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డినీ పోలీసులు ప్రశ్నించారు. వైజాగ్ టూర్ అంటూ చెప్పిన కుమార్తె వ్యవహారశైలిని తండ్రి అనుమానించారు. బంధువులతో కలిసి కీర్తిని నిలదీయగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తన ఫిర్యాదుతో నమోదైన మిస్సింగ్ కేసులో కీర్తి అనుమానితురాలిగా మారింది. పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో, లోతుగా విచారించడంతో పాటు పూర్వాపరాలు ఆరా తీశారు. ఆమె కదలికలు, కమ్యూనికేషన్‌కు సం బంధించి సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిజం బయటపడి నిందితురాలు హయత్‌నగర్ పోలీసులు కీర్తిని విచారించడం, ప్రాథమిక ఆధారాలు సేకరించడం, క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంతో అసలు విషయం గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. దీంతో అప్పటి వరకు ఫిర్యాదిగా ఉన్న కీర్తి అదే కేసులో శశితో కలిసి నిందితురాలిగా మారింది. కీర్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా చేరారు. ఈ మర్డర్ కేసులోనే పోలీసులు కీర్తి, శశిలను అరెస్టు చేశారు. హత్యతో పాటు సంయుక్తంగా ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణ చేర్చారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు రజిత హత్య జరగడానికి కారణాలు, దాని పూర్వాపరాలు తెలుసుకున్న హయత్‌నగర్ పోలీసులు మరో రెండు దారుణాలను గుర్తించారు. కీర్తి మైనర్‌గా ఉన్నప్పుడే బాల్‌రెడ్డితో పాటు శశికుమార్ ఆమెపై అత్యాచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి దారుణాలపై సమాచారం ఉంటే పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలనే నిబంధన ఉంది. దీంతో హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ ఫిర్యాదిగా మారారు. ఆయన ఫిర్యాదుతో సుమోటోగా రెండు పోక్సో యాక్ట్ (మైనర్‌పై అత్యాచారానికి సంబంధించి) కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ నెం.659/2019, 660/2019లతో నమోదైన వీటిలో కీర్తి బాధితురాలిగా ఉంది. వీటిలో మొదటి కేసులో బాల్‌రెడ్డిని, రెండో దాంట్లో శశిని అరెస్టు చేశారు. ఆమన్‌గల్లుకూ ప్రకంపనలు ఈ కేసుల ప్రకంపనలు పొరుగున ఉన్న ఆమన్‌గల్లును తాకాయి. మైనర్‌గా ఉన్న కీర్తిని గర్భవతిని చేసిన బాల్‌రెడ్డి అప్పట్లో అబార్షన్ చేయించాడు. శశికుమార్‌తో కలిసి కారులో ఆమన్‌గల్లులోని పద్మ నర్సింగ్ హోమ్‌లో ఈ చట్ట విరుద్ధమైన పని జరిగింది. ఈ విషయం హయత్‌నగర్ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకివచ్చింది. దీంతో పోలీసులు ఆ ఆస్పత్రి నిర్వాహకులనూ నిందితులుగా చేర్చడానికి నిర్ణయించారు. దీనిపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం ఆ ఆసుపత్రిపై దాడి చేసి సీజ్ చేశారు. -
కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు?
ఆమనగల్లు: హయత్‌నగర్‌లో తల్లి రజితను చంపిన కీర్తికి ఆమనగల్లు పట్టణంలో అబార్షన్ జరిగిందని ప్రసారమాధ్యమాల్లో రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆమనగల్లులో అనుమతి లేకుండా నడుస్తున్న ఆస్పత్రుల్లో ఎలాంటి అర్హతలు లేని అర్‌ఎంపీలు గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆమనగల్లు అబార్షన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తి ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో ఓ బాలికకు అబార్షన్ చేయడంతో ఆర్ఎంపీపై కేసు కూడా నమోదైంది. ఆమనగల్లులో అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నా వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. హయత్‌నగర్‌కు చెందిన రజితను ఆమె కూతురు కీర్తి ప్రియుడితో కలిసి చంపేసింది. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. కీర్తి గర్భవతి కావడంతో ఆమె ప్రియుడు బాల్‌రెడ్డి శశికుమార్ సహకారంతో ఎల్బీ నగర్‌లోని సహారా ఎస్టేట్స్‌లో ఉంటున్న ఓ వైద్యుడిని సంప్రదించారని తెలిసింది. అతడి సలహా మేరకు కీర్తి ఆమనగల్లు పట్టణంలో ఈ ఏడాది జనవరిలో అబార్షన్ చేయించుకున్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా ఆమె ఆమనగల్లులో గర్భస్రావం చేయించుకున్నా.. తల్లిని హత్య చేయడంతో ఈవిషయం వెలుగుచూసింది. ఆర్ఎంపీలదే హవా ఆమనగల్లు పట్టణంలో ఆర్ఎంపీల హవా నడుస్తోంది. దాదాపు 10 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా ఎక్కువగా ఆర్ఎంపీలే నిర్వహిస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. డబ్బులకు ఆశపడి ఇష్టారాజ్యంగా అబార్షన్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అసురక్షిత పద్ధతులతో గర్భం దాల్చిన మహిళలు, బాలికలు గర్భస్రావం కోసం ఆమనగల్లుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్ఎంపీలు అడిగినంత డబ్బులు ఇచ్చి గుట్టుగా అబార్షన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్ఎంపీలు అవసరమున్నా, లేకున్నా రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. పట్టణంలో నాలుగు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు పరీక్షలు చేయించుకుంటున్నారు. నిర్వాహకులు ప్రతిరోజూ ఆర్ఎంపీల వాటాగా కొంత కమీష¯Œ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అవసరం ఉన్నా లేకున్నా పరీక్షలకు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తికి అబార్షన్ చేసింది ఎవరు? హత్య కేసులో నిందితురాలైన కీర్తికి అబార్షన్ చేసింది ఎవరోనని పట్టణంలో జనం గుసగుసలాడుకుంటున్నారు. పోలీసుల విచారణలో కీర్తి ఆమనగల్లులో అబార్షన్ చేసుకున్నట్లు చెప్పింది. ఈ ఘనటకు సంబంధించి ఆమెకు అబార్షన్ చేసిన డాక్టర్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో స్థానిక ఆర్ఎంపీలు, డాక్టర్లలో గుబులు మొదలైంది. -
కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..
హయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లిని హతమార్చిన కుమార్తె కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కీర్తి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమె ఆస్తిపై కన్నేసిన శశికుమార్ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఫొటోలు, వీడియోలు తీసి తల్లిని చంపేందుకు ప్రేరేపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల పుటేజీలు, సాంకే తిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన వెలుగులోకి వచ్చి నాలుగు రోజులైనా దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. కాగా మంగళవారం నిందితులను మహబూబ్‌నగర్ తీసుకెళ్లి అక్కడ కీర్తికి అబార్షన్ చేసిన వైద్యులను విచారించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులు కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు. సొంత కూతురే తల్లిని చంపేలా ఆమె ప్రియుడే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఛేదనలో సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కీర్తి నాన్న శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇంటికొచ్చినా తరచూ మద్యం తాగి భార్య రజితతో గొడవపడేవాడు. ఈ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె కీర్తి అందంగా ఉండడం, ఆమెను ప్రేమలోకి దింపాలని బీటెక్ చదివి జులాయిగా తిరుగుతున్న పొరుగింటి వ్యక్తి శశికుమార్ పథకం పన్నాడు. ఇదే సమయంలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన కీర్తి శశికుమార్‌ను నమ్మింది. ‘మా నాన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఏఈ పర్వతాలు. ఆస్తి బాగానే ఉంది’ అని కీర్తి ముందు శశి బిల్డప్ ఇవ్వడంతో మరింతగా నమ్మేసింది. చివరకు ఆమెను ముగ్గులోకి దించి సన్నిహితంగా ఉన్న సమయంలో కీర్తికి తెలియకుండా వీడియోలు తీశాడు. గర్భం దాల్చిన కీర్తిని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి శశికుమార్‌నే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శశికుమార్ ఇంట్లో చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వాళ్లు ‘నీ ఇష్టమున్నట్టు చేస్కో’ అని వదిలేశారు. ఇక కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి రజితకు చెప్పాడు శశికుమార్. అందుకు రజిత నిరాకరించింది. అమ్మాయి చదువుకునేది చాలా ఉందని చెప్పింది. ఇది మనసులో పెట్టుకున్న శశికుమార్ కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో కీర్తికి గతంలో తాము అద్దెకు ఉన్న పక్క కాలనీలో ఉండే బాల్‌రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. బాల్‌రెడ్డి గురించి తెలిసిన కీర్తి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నా రు. ఈ విషయం తెలిసి శశికుమార్.. కీర్తి వెంటపడ్డాడు. ‘నువ్వు నాతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. అందరికీ చూపిస్తాన’ని బెదిరించాడు. చదవండి: కీర్తి ఇలా దొరికిపోయింది.. తనతోనే ఉండాలని వెంటపడినా మొదట్లో నిరాకరించింది. ఆ తర్వాత శశికుమార్ వేధింపులు తారస్థాయికి చేరాయి. కీర్తి పెళ్లి చేసుకునే బాల్రెడ్డికి కూడా చూపిస్తానంటూ బెదిరించాడు. ఓవైపు అమ్మతో చెబుదామంటే భయం, మరోవైపు తండ్రి పట్టించు కోకపోవడంతో శశికుమార్ ఎలా చెబితే అలా చేయడం మొదలెట్టింది కీర్తి. ఇందులో భాగంగానే శశికుమార్ మొదట వీరి ప్రేమకు అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అంతమొందించాలని నిర్ణయించాడు. కీర్తి సమక్షంలోనే ఆమె చేతుల మీదుగానే రజితను ఈ నెల 19న చున్నీతో ఉరివేసి హత్య చేయించాడు. ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లోనే శవాన్ని ఉంచి కీర్తితో గడిపాడు. దుర్వాసన రావడంతో శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే పట్టాలపై పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శశికుమార్ చెప్పినట్టుగా నటించిన కీర్తి చివరకు తండ్రితోనే అబద్ధం చెప్పి పోలీసులకు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇచ్చింది. అయితే కూతురు ప్రవర్తన అనుమానంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. కీర్తి ధైర్యం చేసి అమ్మ రజితకు చెప్పినా, నాన్న శ్రీనివాస్‌రెడ్డికి చెప్పినా, చివరకు షీటీమ్స్‌ను ఆశ్రయించినా పరిస్థితి హత్య వరకు వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం ఏసీబీ చేతికి చిక్కిన మహబూబ్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతం మూడో భార్య మూడో కుమారుడు శశికుమార్ అని తెలిసింది. కీర్తికి అబార్షన్ చేయించేందుకు మహబూబ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతడి తండ్రి ఏమైనా సహకరించాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించని పోలీసులు బుధవారం నిందితుల అరెస్టు చూపే అవకాశం ఉంది. చదవండి: తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే.. -
టాయిలెట్లో మహిళ ప్రసవం
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవ వేదనతో వచ్చిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో శిశువుకు జన్మనిచ్చింది. అయినా సిబ్బంది స్పందించకపోవడంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, గర్భిణి బంధువుల కథనం ప్రకారం.. మెదక్ మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన రజిత నొప్పులతో శుక్రవారం సాయంత్రం మెదక్ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, ప్రసవం కష్టమవుతుందని.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో గర్భిణి టాయిలెట్‌కు వెళ్లగా నొప్పులు అధికమై అక్కడే ప్రసవించింది. దీంతో ఆమెకు వైద్యం అందించాలని సిబ్బందిని వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో ఆమె బంధువుల ఆందోళనతో ఉన్నతాధికారులు ఆమెకు చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. -
తహసీల్దార్ లైంగిక వేధింపులు
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల తహసీల్దార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అదే కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్ఏ ఒకరు గురువారం డిప్యూటీ తహసీల్దార్ సుజాతకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏర్గట్ల వీఆర్ఏగా పని చేస్తున్న రజిత కొన్ని రోజుల నుంచి తన భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఇది అవకాశంగా తీసుకున్న తహసీల్దార్ లక్ష్మణ్ కొన్ని రోజుల నుంచి తనతో అనైతికంగా వ్యవహరిస్తూ లోబరచుకోవాలని ప్రయత్నిస్తున్నాడని వీఆర్ఏ ఆరోపించారు. ఎన్నికల విధులను నిర్వహించే సమయంలోనూ తనతో అసభ్యకరంగా వ్యవహరించారని రజిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తోటి వీఆర్ఏలకు ఒక విధమైన విధులను అప్పగిస్తూ, తనకు మాత్రం మరో విధమైన డ్యూటీలను అప్పగిస్తు అవమానపరిచాడని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
యువతి ఆత్మహత్య
నెల్లూరు, దొరవారిసత్రం: ప్రేమ విషయంపై చెలరేగిన వివాదంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని శ్రీధనమల్లిలో మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి రజిత (21) తడ మండలం మాంబట్టు ప్రాంతంలో ఉన్న భారత్ ఫుట్‌వేర్ పరిశ్రమలో పనిచేస్తోంది. ప్రేమ విషయమై వివాదం చోటు చేసుకోవడంతో మనస్థాపానికి గురైన రజిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు. సోదరుడితో కలిసి జీవిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ సరస్వతికి లక్ష్మి తోడుకావాలి!
అసలే ఆడపిల్ల... ఆమెకు తోడు మరో ఇద్దరు చెల్లెళ్లు.. బాల్యం సాఫీగా సాగుతున్న సమయంలో కరెంట్ షాక్ వారి కన్నతల్లిని బలి తీసుకుంది. తల్లిలేని ఆ పిల్లలను అమ్మమ్మ చేరదీసి చదువు చెప్పింది. ఖర్చులు పెరగడంతో చేసేది లేక తన మనవరాళ్లను అనాథాశ్రమంలో చేర్చింది. ఆ పిల్లల్లో పెద్ద అమ్మాయి అక్కడే ఉన్నత చదువులను పూర్తి చేసింది. చిన్ననాటి కల అయిన సివిల్స్‌ను సాకారం చేసుకోవడం కోసం మనసున్న మారాజులెవరైనా సాయం చేయకపోతారా అని గంపెడంత ఆశతో ఎదురు చూస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కమటంగూడెం గ్రామానికి చెందిన కమటం భాగ్య, అశోక్ దంపతులకు రజిత, దీపిక మౌనికలున్నారు. కరెంటు షాక్‌తో తల్లి భాగ్య చనిపోవడంతో వారికి అండగా ఉండాల్సిన తండ్రి వేరే పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకున్నారు. ముగ్గురు పిల్లలను అమ్మమ్మ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి తీసుకువచ్చింది. ఏడోతరగతి వరకు తమ్మడపల్లిలో చదువుకున్న రజిత ఆ తరువాత బచ్చన్నపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్నారు. 2006లో పదో తరగతిలో 90 శాతం మార్కులు సాధించారు. 2008లో ఇంటర్ జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్వీ జూనియర్ కాలేజిలో పూర్తి చేశారు. అనాథ ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత చదువులు.. అమ్మమ్మ ఇంటి వద్దనుంచే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇంటర్ వరకు చదివిన రజిత 2008లో జఫర్గడ్ మండలం రేగడితండాలో ఉన్న మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమంలో చేరారు. ఆశ్రమంలో ఉంటూనే ఉన్నత చదువులను అభ్యసించారు. అనాథ ఆశ్రమం నుంచి హన్మకొండకు రోజు వెళ్లి వస్తూ డిగ్రీ, డబుల్ పీజీ పూర్తి చేశారు. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కాలేజిలో బీఎస్సీలో గోల్డ్ మోడల్ సాధించారు. పీజీ ఎంట్రెస్లో టాప్ 10లో ర్యాంకు సాధించి వరంగల్ నిట్‌లో సీటు సాధించారు. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌తో పీజీని పూర్తి చేశారు. తరువాత కాకతీయ యూనివర్శిటీలో ఎంఎస్‌డబ్ల్యూ రెండో పీజీని పూర్తి చేశారు. చేయూత కోసం ఎదురుచూపులు.. అనాథాశ్రమంలో ఉండి చదువుకున్న రజితకు వసతి కల్పించడమే కష్టతరం. అలాంటిది ఏకంగా సివిల్స్ కోచింగ్‌కు లక్షల్లో ఫీజులు ఉండడంతో చెల్లించలేని దుస్థితి. మా ఇల్లు ఆశ్రమ నిర్వహకులు గాదె ఇన్నారెడ్డి దాతల సహకారంతో కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసినప్పటికీ ఆ మొత్తం కోచింగ్ ఫీజులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణపడి ఉంటానని రజిత వేడుకుంటున్నారు. రజితకు సాయం చేయదలిస్తే 9866216680 సెల్ నంబర్లో సంప్రదించవచ్చు. తలో చేయి వేసి అనాథకు చేయూతనిద్దాం. – ఇల్లందుల వెంకటేశ్వర్లు,సాక్షి, జనగామ జిల్లా -
అమ్మకెంత కష్టం!
పెద్దపల్లిటౌన్: నవమాసాలు మోసి బిడ్డను లోకానికి అందిస్తున్న తల్లులు పడుతున్న నరకయాతనకు రజిత సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రసూతి సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా పరిణమించింది. గర్భాశయం నుంచి మాగి తొలగించే ప్రయత్నంలో రజిత ఉదరభాగంలోని పేగు తెగిపోవడంతో మలమూత్రాలు జననాంగం నుంచి వస్తున్నాయి. దీంతో బాధితురాలు నరకయాతన అనుభవిస్తోంది. పెద్దపల్లి మండలం బొంపల్లికి చెందిన గౌడ సరస్వతీ, నర్సయ్యల కూతురు రజిత ప్రసూతి కోసం ఫిబ్రవరి 14న పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు నర్సు తోటి సిబ్బందితో కలసి సిజేరియన్ చేయగా.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రజిత తన కుమారుడిని చూసి సంతోషించే లోపే.. ఆమె జననాంగం నుంచి ఏకకాలంలో రక్తస్రావంతోపాటు మలమూత్రాలు రావడం గమనించి భయంతో వణికిపోయింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది బాలింతను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రసూతి సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడం వల్ల స్టాఫ్‌నర్స్ రమ్యకృష్ణ, సిబ్బంది కలసి రజితకు పురుడుపోశారు. ఆ సమయంలో మహిళా వైద్యురాలు లీలా అందుబాటులో లేక పోవడంతో తమ కూతురు ప్రాణం మీదకు తెచ్చారని తల్లిదండ్రులు సరస్వతీ, నర్సయ్యలు కలెక్టర్ శ్రీదేవసేన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి మరోసారి ఎంజీఎంకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ అధికారులను పురమాయించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ను కలెక్టర్ ఆదేశించారు. కేసీఆర్ కిట్ కోసం ఆశపడి వెళితే..! రజిత తల్లిదండ్రులు సరస్వతీ, నర్సయ్య సోమవారం స్థానిక ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న కిట్‌కు, నగదుకు ఆశపడి ఆస్పత్రికి వెళ్తే చావు మీదకు వచ్చిందని వాపోయారు. కలెక్టర్ జోక్యం చేసుకున్నా తన కూతురుకు మెరుగైన వైద్యం లభించడం లేదన్నారు. కూతురుకు వచ్చిన కష్టం మరే బిడ్డకు రావొద్దని కన్నీటి పర్యంతమయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. మామూలు స్థితికి రాగానే ఆపరేషన్ రజితకు ప్రస్తుతం రక్తస్రావమవుతోంది. పేగులు పచ్చిగా ఉండటంతో ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఆమెకు మెరుగైన చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు నిపుణులైన వైద్యులతో శస్త్రచికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎంలో సైతం చికిత్సకు నిరాకరించి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. – మల్లేశం, ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్షలో ఒకరికి ఇలాంటి ఆపద రజితకు వచ్చిన ఆపద లక్షలో ఒకరికి వస్తుంది. ప్రసూతి సమయంలో బేబి సైజు పెద్దది కావడంతో ఇలా జరిగింది. అయినా పెద్ద ప్రమాదమేమీ లేదు. తిరిగి సర్జరీ ద్వారా రజితను మామూలు స్థితిలోకి తీసుకురావచ్చు. ఆందోళనకు గురై అవగాహన లేక ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఘటనపై విచారణ కూడా జరుపుతున్నాం. – ప్రమోద్, డీఎంహెచ్‌వో, పెద్దపల్లి -
విజ్ఞానమే తలదించుకునేలా!
గొల్లపల్లి(ధర్మపురి): విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు మూఢనమ్మకాలు పాటించి విద్యార్థులకు పసు పు బియ్యం పెట్టింది. పాఠశాలలో పోగొట్టుకున్న రూ.200 కోసం విద్యార్థులపై దొంగ తనం నెపం మోపి వారితో పసుపు బియ్యం తినిపించింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇవ్వకపోతే చచ్చిపోతారని.. రాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మొత్తం 19 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న రజిత పర్సులోని రూ.200 ఈ నెల 6వ తేదీన పోయాయి. విద్యార్థులే తనడబ్బులు దొంగిలించినట్లు ఉపాధ్యాయురాలు భావించింది. మరుసటిరోజు టీచర్ పసుపు బియ్యంతో పాఠశాలకు వచ్చింది. 12 మంది విద్యార్థులకు వాటిని పెట్టింది. బియ్యం తిన్నవారు తన డబ్బులు తీయలేదని, తిననివారు దొంగతనం చేసినట్లే అని చెప్పింది. తీసినవారు మరుసటి రోజు డబ్బులు తెచ్చి ఎవరికీ చెప్పకుండా ఇవ్వాలని లేకపోతే చచ్చిపోతారని బెదిరించింది. దీంతో చేసేది లేక విద్యార్థులు పసుపు బియ్యం తిన్నారు. ఈ విషయం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ క్రమంలో గ్రామంలో శివరాత్రి జాతర ఉండటం, పాఠశాలకు సెలవులు వచ్చాయి. పాఠశాల గురువారం ప్రారంభం కావడంతో జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి టీచర్ రజితను నిలదీశారు. పసుపు ఆంటీబయాటిక్ అని ఇది తింటే ఏమీ కాదని దొంగతనం చేసిన డబ్బులు తిరిగి తెస్తారని ఇలా చేసానని తల్లిదండ్రులతో టీచర్ చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు టీచరుపై చర్య తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణలో పెట్టేందుకే.. పిల్లలకు చెడు అలవాట్లు చేసుకోవద్దని వారిని క్రమశిక్షణలో పెట్టేందుకే పిల్లలకు పసుపు బియ్యం పెట్టాను. నా రూ.200 కోసం ఇలా చేయలేదు. పసుపు బియ్యం కూడా ఆంటిబయాటిక్‌గా పనిచేస్తాయి. వాటితో ఎలాంటి హానీ ఉండదు. విద్యార్థులు దొంగతనం చేసి ఉంటే మరోసారి చేయకుండా భయపెట్టాలని ఇలా చేశాను. నేను చేసింది తప్పు అయితే క్షమించండి. అందరూ నాపై కక్షకట్టి రాద్దాంతం చేస్తున్నారు. – రజిత, ఇంగ్లిష్ టీచర్ -
మాపై ఎటువంటి ఒత్తిడి లేదు
సాక్షి, హైదరాబాద్: తాము లొంగిపోవడానికి సైద్ధాంతిక విభేదాలే కారణమని మావోయిస్టు నేత జంపన్న తెలిపారు. తమ లొంగుబాటు వెనుక ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ లైన్ ప్రకారం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామని చెప్పారు. పీపుల్స్‌వార్, మావోయిస్టుల లైన్ ఆ పరిస్థితుల్లో సరైందేనని.. గత 15 ఏళ్లలో దేశంలో అనేక సామాజిక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్ధ భూస్వామ్య పద్ధతి సరికాదని.. ఇప్పుడు భూస్వాములు లేరు, ఇప్పుడా భూస్వామ్య వ్యవస్థ కూడా లేదన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడంలో మావోయిస్టు పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, కాలానికి అనుగుణంగా మారలేకపోయిందని అభిప్రాయపడ్డారు. తనకున్న అభిప్రాయాలపై కమిటీతో నిర్దిష్టంగా చర్చించలేకపోయానని, అందుకే కేంద్ర కమిటీకి లేఖ రాసి బయటకు వచ్చానని వెల్లడించారు. తన ఆలోచనకు అనుగుణంగా పార్టీని మార్చడం సాధ్యం కాదని తెలుసుకుని, సాధారణ జీవితం గడపటానికి బయటకు వచ్చానని చెప్పారు. జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇచ్చేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. మాపై ఎటువంటి ఒత్తిడి లేదు -
మాకెందుకీ శాపం..
పై ఫొటొలో దీనంగా కనిపిస్తున్న మహిళ పేరు గొర్రె రజిత. ఆ పక్కన పిల్లలు ఆమె కుమారులు యశ్వంత్, సన్నీ. వీరిది పరకాల మండలం చౌటుపర్తి. పిల్లలతో కలిసి ఈమె బుధవారం హన్మకొండలోని రూరల్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చింది. ఆ సమయంలో కలెక్టర్ జీవన్ ప్రశాంత్ పాటిల్ మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు శాయంపేట వెళ్లారు. దీంతో కలెక్టరేట్ ఆవరణలోని అరుగుపై పిల్లలతో కలిసి దిగులుగా కూర్చుని కనిపించింది. విషయమేమిటని ఆరా తీస్తే రజిత తన దీనగాథను వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... వరంగల్ రూరల్ : ‘నా భర్త సదానందం(28). మాకు ఉన్న రెండు ఎకరాల్లో ఏటా పత్తి, ఇతర పంటల సాగు చేస్తూ జీవిస్తున్నాం. ఏ సంవత్సరం కూడా అతివృష్టి లేదా అనావృష్టి కారణాలతో లాభాలు కళ్ల చూడలేదు. దీంతో నేను కూడా కూలి పనులకు వెళ్తూ పదో, పరకో సంపాదించేదాన్ని. అయితే, ఈ ఏడాది నా భర్త మా భూమిలోనే పత్తి వేశాడు. పత్తి గింజలు, ఎరువులు, పురుగు మందుల కోసం తెలిసిన వారి వద్ద సుమారు రూ.4 లక్షల మేర అప్పులు తెచ్చాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట జాలు వారింది. దీంతో పంట చేతికి రాదని తేలిపోయింది. ఇక ఏం చేయాలో ఆయనకు పాలు పోలేదు. పత్తి పంటలో గడ్డి చనిపోవడానికి పిచికారీ చేయాల్సిన మందు తాగి గత నెల 27న సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ రోజు నేను కూలి పనికి పోయి ఇంటికి వచ్చేసరికి చుట్టు పక్కల వాళ్లంతా మా ఇంటి దగ్గర గుమికూడారు. విషయం తెలుసుకున్న నేను, చుట్టు పక్కల వాళ్ల సహకారంతో నా భర్త సదానందంను చికిత్స నిమిత్తం పరకాలలోని సంతోష్ కుమార్ ఆస్పత్రికి తీసుకువెళ్లాం. అక్కడ చికిత్స పొందుతూ 30వ తేదీన ఉదయం మృతి చెందాడు. ప్రస్తుతం మా పిల్లలు ఆరేళ్ల యశ్వంత్, ఐదేళ్ల సన్నీతో పాటు వృద్ధులైన అత్తామామలను పోషించాల్సిన బాధ్యత నాపై పడింది. దీంతో కూలి పనులకు వెళ్తున్నా. నా భర్త చనిపోయి ఇంకా నెల కూడా ఎల్లలేదు. ఆ దుఃఖం నుంచి కూడా మేం తేరుకోలేదు. ఇంతలోనే మాకు అప్పులు ఇచ్చిన వాళ్లు వాటిని తీర్చాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అప్పు తీసుకున్నప్పుడు తీర్చాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కానీ ఐదో తరగతి వరకు చదువుకున్న నాకు చిన్నతనంలోనే పెళ్లి కాగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఇప్పుడు నా భర్త సదానందం మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పులు తీర్చడం మాట పక్కన పెడితే కుటుంబ పోషణకే అష్టకష్టాలు పడుతున్నా. ఈ సమయంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. మా దీనగాధ విని కలెక్టర్ సారు ఏదైనా దారి చూపిస్తారేమోననే ఆశతో కలుద్దామని వచ్చాను. కానీ సార్ లేడు’ అతివృష్టి లేదా అనావృష్టితో ఏటా నష్టమే తప్ప లాభం కళ్లచూడని వేలాది మంది రైతుల్లో సదానందం ఒకరు. ‘పంట నష్టపోయాను.. అప్పులు తీర్చే మార్గం లేదు.. అప్పులు ఇచ్చిన వాళ్ల ముందు తల ఎత్తుకోవడం ఎలా’ అనే బాధతో ఆయన లోకాన్నే వీడిపోయాడు. అసలే కుటుంబం పెద్ద కోల్పోయిన దుఃఖంలో ఉన్న సదానందం కుటుంబానికి ఇప్పుడు కనీస ఓదార్పు అవసరం. కానీ ఒంటరి మహిళ అనే జాలి కూడా లేకుండా అప్పులు చెల్లించాలని వెంట పడుతున్నారనేది రజిత ఆవేదన. ఆమెను ప్రభుత్వం తరఫున ఆదుకునేలా జిల్లా అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం.. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కదిరి టౌన్ : కదిరి మున్సిపల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన రాజు కుమార్తె రజిత(15) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ రాజేశ్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే ఆమె, తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఎలుకల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హుస్సేన్‌సాగర్‌లో దూకబోతే..
రాంగోపాల్‌పేట్: భార్యభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి తగాదాతో ఓ మహిళ కండక్టర్ హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ మండలం కాలికానగర్‌కు చెందిన పందె శ్రీనివాస్‌రెడ్డి, పందె రజిత(33)లు భార్యభర్తలు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజిత ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తుంది. గురువారం ఉదయం భార్యభర్తల మధ్య చిన్నతగాదా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దీంతో ఆమె హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని సాయంత్రం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. లేపాక్షి ప్రాంతంలో హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా గస్తీలో ఉన్న లేక్ పోలీసులు గుర్తించి ఆమెను రక్షించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
నిడదవోలు (పశ్చిమ గోదావరి): అమెరికాలో ఉన్నత వర్గాల వారి ఇళ్లల్లో పని చేసేందుకు మహిళలు కావాలంటూ నమ్మబలికారు. వారి ఉచ్చులో పడిన సరూర్‌నగర్ మండలం జల్లెడగూడ గ్రామానికి చెందిన రజితను అమెరికాకు బదులుగా మస్కట్ పంపించారు. ఆమెను అక్కడి ఆసుపత్రిలో చేర్చి కిడ్నీలు తొలగించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆ మహిళ అక్కడి వైద్యుల నుంచి తప్పించుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కొందరి సాయంతో సురక్షితంగా హైదరాబాద్ చేరింది. అనంతరం రంగారెడ్డి జిల్లా నూర్పేట పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించే పనిలో పడ్డారు. రజిత అనే మహిళను మస్కట్ పంపించడానికి మధ్యవర్తిత్వం నెరిపిన వ్యక్తి సాయంతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదేకుర్రు గ్రామానికి చెందిన బుట్టా శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు వలవేశారు. విమాన చార్జీల నిమిత్తం బాధితురాలు చెల్లించాల్సిన సొమ్ము తీసుకునేందుకు రావాల్సిందిగా ఏజెంట్‌కు ఫోన్లో సమాచారం ఇప్పించారు. ఆ సొమ్మును శనివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తీసుకొచ్చి ఇవ్వాలని కోరిన ఏజెంట్ శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన తన స్నేహితుడు యడ్ల సత్యతో కలసి మోటార్ సైకిల్‌పై నిడదవోలు చేరుకున్నాడు. అప్పటికే మధ్యవర్తిని వెంటబెట్టుకుని నిడదవోలులో మాటువేసిన నూర్పేట క్రైం బ్రాంచ్ ఎస్సై ఎస్.రామకృష్ణ, సిబ్బంది కలసి ఏజెంట్ బుట్టా శ్రీనివాస్, అతని స్నేహితుడు సత్యను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. -
ప్రేమజంట ఆత్మహత్య
పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా మహానంది ప్రాంతానికి చెందిన అశోక్, అహోబిలానికి చెందిన రజిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శుక్రవారం ఉదయం మహానంది సమీపంలోని ఎంసీఫారమ్ గ్రామ అటవీ ప్రాంతంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వడదెబ్బకు ఇద్దరు మృత్యువాత
వరంగల్ జిల్లాలో వడెదెబ్బ కారణంగా శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన కొలిపాక రజిత (35) గురువారం కూలీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురైంది. వాంతులు అవుతుండడంతో స్థానికంగానే వైద్య చికిత్స ఇప్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం మృతి చెందింది. ఆమెకు భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో ఘటనలో ఏటూరు నాగారం మండలం గూడరేవుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బూషయ్యగౌడ్ వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు.