ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి | woman dies of house vandalised in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి

Published Sat, Sep 5 2015 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

పాత ఇల్లు కూల్చివేత పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ అక్కడే సజీవ సమాధి అయ్యింది.

రసూల్‌పుర (హైదరాబాద్): పాత ఇల్లు కూల్చివేత పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ అక్కడే సజీవ సమాధి అయ్యింది. హైదరాబాద్ నగరం బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్ల సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ముత్యాలు అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లును కూల్చివేస్తున్న సమయంలో నేడు సాయంత్రం ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి అక్కడే ఉన్న రజిత (23) అనే కూలీపై పడిపోయింది.

ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రజిత అల్వాల్‌లోని ఖానాజీగూడ నివాసి అని తెలిసింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంటి యజమాని ముత్యాలుపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement