
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటి రజిత (Actress Rajitha) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయ లక్ష్మి (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ప్రముఖ క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మికి చెల్లెళ్లు అవుతారు. విజయలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. శనివారం (మార్చి 22న) ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
కెరీర్ అలా మొదలైంది..
రజిత 18 ఏళ్ల వయసులోనే వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆమె నటించిన మొదటి సినిమా బ్రహ్మ రుద్రులు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కూతురిగా నటించింది. ఆ తర్వాత సహాయనటిగా తెలుగులో దాదాపు 200 సినిమాలు చేసింది. పెళ్లి కానుక సినిమాకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డు అందుకుంది.
కూలీ నెం.1, ప్రేమ ఖైదీ, పెళ్లి సందడి, జులాయి, వర్షం, మల్లీశ్వరి, సరైనోడు, పండగ చేస్కో, పిల్లా నువ్వు లేని జీవితం, వీర సింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా గతేడాది రిలీజైన ఉషా పరిణయం మూవీలో యాక్ట్ చేసింది. తమిళంలో కుసేలన్, లింగా, విశ్వాసం, అన్నాత్తె, చంద్రముఖి 2 చిత్రాల్లో నటించింది. మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కటి చొప్పున సినిమా చేసింది.
చదవండి: బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా
Comments
Please login to add a commentAdd a comment