
కవ్వింత: ఇప్పుడలా కాదే!
భార్య: ఏవండీ... పెళ్లయిన కొత్తలో, మీరు తింటూ నాక్కూడా గోరుముద్దలు పెట్టేవారు. ఇప్పుడలా చేయడం లేదేంటండీ....
భర్త: అప్పుడంటే నీ వంట దరిద్రంగా ఉండేది. ఇప్పుడు రుచిగానే ఉంటోంది కదా.
భార్య: ఆ...!
అతి తెలివి
బాస్: నీకసలు బుద్ధుందా... ఆఫీసుకు స్విమ్ సూట్ వేసుకొస్తావా?
రజిత: అదేంటి సార్... మన ఆఫీసు మునిగిపోయే దశలో ఉంది, అందరూ అలెర్ట్‌గా ఉండండి అని నిన్న మీరేగా చెప్పారు!
బతకనేర్చాడు!
రాజు, రవి అడవికి వేటకెళ్లారు. అంతలో పులి వచ్చి ఎదురుగా నిలబడింది. వెంటనే రాజు పరుగెత్తబోయాడు.
రవి: నీకేమైనా పిచ్చా... తప్పించుకుందామనే, పులికంటే వేగంగా పరుగెత్తగలవా నువ్వు?
రాజు: పులి కంటే ఎందుకు... నీకంటే వేగంగా పరుగెత్తితే చాలు కదా... అంటూ రయ్యిమన్నాడు రాజు.
రూల్స్ పాటిస్తే...
టీచర్: ఏంటింత లేటయ్యింది?
బన్ని: రూల్స్ ఫాలో అయ్యాను మేడమ్. అందుకే లేటయ్యింది.
టీచర్: స్కూలుకి లేటయ్యేంత రూల్సేం పాటించావ్ బాబూ?
బన్ని: ఇక్కడ స్కూలు ఉంది, నెమ్మదిగా వెళ్లండి అని రోడ్డు పక్కన రాసుంది మేడమ్. అందుకే మెల్లగా వచ్చా. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మీరేగా చెప్పారు!