
పెళ్లికి నిరాకరించాడని..
యువతి పరిస్థితి విషమం
పోలీసుస్టేషన్ సమీపంలో ఘటన
జైపూర్ : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మండలంలోని పోలంపల్లి గ్రామానికి చెందిన తగరం రజిత సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథనం ప్రకారం.. రజిత టైలరింగ్ నేర్చుకోవడానికి భీమారం గ్రామానికి వెళ్లేది. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ నెల 4న శ్రీనివాస్ ఇంటి ఎదుట మౌనపోరాటం చేపట్టింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడని, పెళ్లి సంబంధాలు చెడగొట్టాడని ఆ రోపించింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా సోమవారం వారిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. శ్రీనివాస్ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం జరగదని మనస్తాపం చెందిన రజిత పోలీసుస్టేషన్ సమీపంలో హెయిర్ డై తాగింది. 108లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.