హుస్సేన్‌సాగర్‌లో దూకబోతే.. | Woman Conductor attempt to suicide in Hussain sagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లో దూకబోతే..

Published Thu, Jul 14 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

Woman Conductor attempt to suicide in Hussain sagar

రాంగోపాల్‌పేట్: భార్యభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి తగాదాతో ఓ మహిళ కండక్టర్ హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ మండలం కాలికానగర్‌కు చెందిన పందె శ్రీనివాస్‌రెడ్డి, పందె రజిత(33)లు భార్యభర్తలు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రజిత ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తుంది. గురువారం ఉదయం భార్యభర్తల మధ్య చిన్నతగాదా ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది.

దీంతో ఆమె హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని సాయంత్రం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. లేపాక్షి ప్రాంతంలో హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా గస్తీలో ఉన్న లేక్ పోలీసులు గుర్తించి ఆమెను రక్షించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement