
హయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లిని హతమార్చిన కుమార్తె కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కీర్తి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమె ఆస్తిపై కన్నేసిన శశికుమార్ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఫొటోలు, వీడియోలు తీసి తల్లిని చంపేందుకు ప్రేరేపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
సీసీ కెమెరాల పుటేజీలు, సాంకే తిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన వెలుగులోకి వచ్చి నాలుగు రోజులైనా దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. కాగా మంగళవారం నిందితులను మహబూబ్‌నగర్ తీసుకెళ్లి అక్కడ కీర్తికి అబార్షన్ చేసిన వైద్యులను విచారించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులు కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment