Sashikumar
-
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..
హయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లిని హతమార్చిన కుమార్తె కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కీర్తి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఆమె ఆస్తిపై కన్నేసిన శశికుమార్ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకుని ఫొటోలు, వీడియోలు తీసి తల్లిని చంపేందుకు ప్రేరేపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఇంతవరకు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల పుటేజీలు, సాంకే తిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన వెలుగులోకి వచ్చి నాలుగు రోజులైనా దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు అధికారులెవరూ ముందుకు రాలేదు. కాగా మంగళవారం నిందితులను మహబూబ్‌నగర్ తీసుకెళ్లి అక్కడ కీర్తికి అబార్షన్ చేసిన వైద్యులను విచారించినట్లు తెలిసింది. ప్రధాన నిందితులు కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గురువారం పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
వాళ్లెవరూ నటించనన్నారు!
తమిళసినిమా: పలువురు హీరోయిన్లు అసురవధం చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని నటుడు, దర్శక నిర్వాత శశికుమార్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అసురవధం. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మరుదు పాండియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందితా శ్వేత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గోవింద్ వసంత్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర కథానాయకుడు శశికుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు తన చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన మిత్రుడు ప్రేమ్ ఈ చిత్ర దర్శకుడు మరుదు పాండియన్‌ను కథ చెప్పడానికి తన వద్దకు పంపారన్నారు. కథ వినగానే తానే చిత్రాన్ని నిర్మించాలని భావించానని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత లలిత్ సార్ మీతో నేను చిత్రం చేయాలని కోరుకుంటున్నానన్నారన్నారు. నిజానికి తానూ అప్పుడు కాస్త కష్టాల్లో ఉండడంతో ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను లలిత్‌కు అప్పగించానని తెలిపారు. ఆయన, కదిర్ కష్ట సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కొడైక్కెనాల్లో చేశామని, అతి శీతోష్ణంలోనూ చిత్ర యూనిట్ అంతా శ్రమ అని భావించకుండా కష్టపడి పని చేశారని చెప్పారు. నిర్మాత లలిత్ మీపై నమ్మకం ఉంది, మీరు ఏం అనుకంటే అది చేయండి అని అనడంతో తనకు మరింత భయం అనిపించిందన్నారు. రెండు రోజుల క్రితమే చిత్రం చూపిన నిర్మాత లలిత్ సార్ తనకు మొదటి చిత్రాన్నే ఉత్తమ చిత్రంగా అందించారని చెప్పడంతో సంతోషం కలిగిందన్నారు. చిత్రంలో నటన తెలిసిన నటిని ఎంపిక చేయండని దర్శకుడికి చెప్పానన్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు ఇందులో నటించడానికి నిరాకరించారని, అలాంటి సమయంలో కథను అర్థం చేసుకుని నటి నందితాశ్వేత నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలో నటించడానికి ఎవరూ ఒప్పుకోరని అన్నారు. అలాంటి పాత్రలో రచయిత వసుమిత్రను నటించడానికి ఒప్పించామని తెలిపారు. ఇది మంచివాడు, దుర్మార్గుడిల కథా చిత్రం అని శశకుమార్ వెల్లడించారు. అసురవధం చిత్రంలో చాలా ఎమోషనల్, ఘనమైన సన్నివేశాలు కలిగిన పాత్రను తాను నటించగలనని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నటి నందితా శ్వేత పేర్కొంది. దర్శకుడు మరుదు పాండియన్, నటుడు విసుమిత్ర, నిర్మాత లలిత్ పాల్గొన్నారు. -
శశికుమార్, నానిలతో ద్విభాషాచిత్రం?
చెన్నై: తమిళనటుడు శశికుమార్, తెలుగు నటుడు నానిలతో దర్శకుడు సముద్రఖని ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. నటుడు, దర్శకుడు అంటూ జోరు గుర్రాల స్వారీ చేస్తున్న సముద్రఖని ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన అప్పా, తొండన్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. మరో పక్క ఇతర చిత్రాలలో ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సముద్రకని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన నాడోడిగళ్ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదే విధంగా జయంరవి ద్విపాత్రాభినయం చేసిన నిమిర్న్దు నిల్ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించారు. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఇందులో నాని కథానాయకుడిగా నటించారు. ఇదే విధంగా మరో సారి సముద్రకని ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో తమిళవెర్షన్లో శశికుమార్, తెలుగులో నాని హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం నిన్నుకోరి శుక్రవారం తెరపైకి రానుంది. కాగా నాని అక్కడ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సముద్రకని దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తారన్న విషయం గురించి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అదే విధంగా శశికుమార్ ప్రస్తుతం కొడివీరన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.