
నటి చైత్రా జె.అచ్చర్, నటుడు శశికుమార్
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.
ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..!
Comments
Please login to add a commentAdd a comment