Tamilanadu actors
-
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
ఆ లక్కీ ఛాన్స్ ఆమెకేనా?
తమిళసినిమా: నటుడు విజయ్ చివరి చిత్రంలో నటించనున్న కథానాయకి ఎవరన్నది ఇప్పటికీ ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ ప్రస్తుతం కోర్ట్ చిత్రాన్ని పూర్తి చేశారు. వెంకట ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.కాగా తదుపరి ఒక్క చిత్రంలో నటించి విజయ్ నటనకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అదే ఈయన 69వ చిత్రం. దీనికి హెచ్ వినోద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇది పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగే కళా చిత్రంగా ఉంటుందని, విజయ్ రాజకీయ జీవితానికి హెల్ప్ అయ్యే చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ చిత్రంలో విజయ్‌తో జతకట్టే కథానాయకి ఎవరన్న విషయంపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో నటి నయనతార మరోసారి విజయ్‌తో జత కట్టనున్నట్లు, కాదు టాలీవుడ్ యువ క్రేజీ నటి శ్రీలీల ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎవరు కాదు ఆ లక్కీ ఛాన్స్ మరోసారి సంచలన నటి సమంత కే దక్కిందన్నది సమాచారం.మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కృషి చిత్రం తర్వాత ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే మళ్లీ తన రీ ఎంట్రీ భారీగా ఉండాలని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. హలో ఈమె సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే ఒక మలయాళంలోనూ, ఒక హిందీ చిత్రంలోను నటించే అవకాశాలు వచ్చాయని ప్రచారం కూడా జరిగింది. కాగా విజయ్‌తో సమంత ఇప్పటికే తెరి, మెర్సల్, కత్తి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఆయనతో నాలుగో సారి జత కట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
రీలే కాదు.. రియల్ హీరోలు కూడా..
సాక్షి, చెన్నై: వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలను ప్రకటించిన తమిళ నటీనటులు శనివారం స్వయంగా సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమిళ నటులు విశాల్, ధనుష్, కార్తీ, సిద్ధార్థ్, కోవై సరళ, ఖుష్బూ తదితరులు వివిధ ప్రాంతాల్లో సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు తమ తరఫున ఆహార పొట్లాలను, మంచి నీటి పాకెట్లను అందించారు. హీరో విశాల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కొంతమంది బాధితులకు ఆహారాన్ని అందించారు. బాధితులతో మమేకం అయ్యి వారి కష్టనష్టాలను తెలుసుకున్నాడు. కార్తీ కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యాడు. నటీమణులు ఖుష్బూ, కోవై సరళలు తమ వంతుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హీరో సిద్ధార్థ్ ఒక టీమ్‌నే తయారు చేసుకుని వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ట్వీటర్ ద్వారా వలంటీర్లతో అనుసంధానమై పనిచేస్తున్నాడు. వీలైన వారు ఆహార పొట్లాలను, నీళ్ల బాటిళ్లను తెచ్చి బిగ్ ఎఫ్ఎమ్ ఆఫీసులో అందజేయాలని, అక్కడి వరకూ రాలేని వాళ్లు ట్వీటర్ ద్వారా సమాచారం అందిస్తే తమ వాళ్లే వాహనాల్లో వచ్చి వాటిని సేకరిస్తారని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ‘మా’ 5 లక్షల విరాళం: ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు చెన్నై తల్లి లాంటిది. అలాంటి చెన్నై నగర ప్రజల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికే మా బిడ్డల్లాంటి హీరోలు స్పందించి తమకు తోచిన సాయాన్ని ప్రక టించారు. అందుకే ‘మా’ అసోసి యేషన్ తరపున కూడా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాం’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.