ఆ లక్కీ ఛాన్స్‌ ఆమెకేనా? | Tamil Actor Vijay's Last Movie Heroine Chance Review | Sakshi
Sakshi News home page

ఆ లక్కీ ఛాన్స్‌ ఆమెకేనా?

Published Wed, Jul 3 2024 11:32 AM | Last Updated on Wed, Jul 3 2024 11:32 AM

Tamil Actor Vijay's Last Movie Heroine Chance Review

తమిళసినిమా: నటుడు విజయ్‌ చివరి చిత్రంలో నటించనున్న కథానాయకి ఎవరన్నది ఇప్పటికీ ఆసక్తిగా మారింది. రాజకీయ పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్‌ ప్రస్తుతం కోర్ట్‌ చిత్రాన్ని పూర్తి చేశారు. వెంకట ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ కథా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

కాగా తదుపరి ఒక్క చిత్రంలో నటించి విజయ్‌ నటనకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారిస్తారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అదే ఈయన 69వ చిత్రం. దీనికి హెచ్‌ వినోద్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇది పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగే కళా చిత్రంగా ఉంటుందని, విజయ్‌ రాజకీయ జీవితానికి హెల్ప్‌ అయ్యే చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ చిత్రంలో విజయ్‌తో జతకట్టే కథానాయకి ఎవరన్న విషయంపై చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో నటి నయనతార మరోసారి విజయ్‌తో జత కట్టనున్నట్లు, కాదు టాలీవుడ్‌ యువ క్రేజీ నటి శ్రీలీల ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎవరు కాదు ఆ లక్కీ ఛాన్స్‌ మరోసారి సంచలన నటి సమంత కే దక్కిందన్నది సమాచారం.

మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత కృషి చిత్రం తర్వాత ఇప్పటివరకు ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే మళ్లీ తన రీ ఎంట్రీ భారీగా ఉండాలని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. హలో ఈమె సొంతంగా చిత్రం నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే ఒక మలయాళంలోనూ, ఒక హిందీ చిత్రంలోను నటించే అవకాశాలు వచ్చాయని ప్రచారం కూడా జరిగింది. 

కాగా విజయ్‌తో సమంత ఇప్పటికే తెరి, మెర్సల్, కత్తి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఆయనతో నాలుగో సారి జత కట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్‌ నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement