విజయ్‌కు జోడిగా నయన్‌! | Nayantara Plays Female Lead Character In Vijay And Atlee Movie | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 26 2018 2:33 PM | Last Updated on Mon, Nov 26 2018 3:45 PM

Nayantara Plays Female Lead Character In Vijay And Atlee Movie - Sakshi

సర్కార్‌ సినిమాతో బాక్సాఫీస్‌పై దండెత్తిన ఇళయ దళపతి విజయ్‌.. తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మెర్సెల్‌, సర్కార్‌ లాంటి బిగ్గెస్ట్‌ హిట్స్‌ తరువాత విజయ్‌ చేయబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికీ సర్కార్‌ హవా కొనసాగుతూనే ఉంది. వివాదాల మధ్య ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతూ.. మెర్సెస్‌ రికార్డులను బద్దలుకొట్టింది. 

విజయ్‌ తన 63వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరి’, ‘మెర్సెల్‌’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు హ్యాట్రిక్‌ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, సినిమా టైటిల్‌ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement