chaithra
-
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
Chaithra J Achar: సప్త సాగరాలు దాటి సైడ్-బిలో వేశ్యగా నటించిన హీరోయిన్ (ఫోటోలు)
-
బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..
సాక్షి, మైసూరు: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని ప్రియునితో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డుపైనే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొట్టును తెంచివేసి జుట్టు పట్టుకొని తండ్రి ఈడ్చుకెళ్తుండగా జనం అడ్డుకున్నారు. వివరాలు... నంజనగూడు తాలూకాలోని హరతళె గ్రామానికి చెందిన చైత్ర, హల్ళెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకున్నారు. చదవండి: (లైంగిన దాడికి గురైన బాలికకు శిశువు జననం) యువతి తల్లిదండ్రులు దీనిని అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడుముళ్లు వేసుకుని, ఆ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బవసరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచి, ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు. చైత్ర కాపాడండి అని అరవడంతో స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సహాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తండ్రిపై ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. -
26 ఏళ్లకే జిల్లా జడ్జిగా..
రాయచూరు రూరల్: చదువుకునే వయసులోనే ఆమె ప్రతిభకు పదునుపెట్టి జిల్లా కోర్టు జడ్జి ఉద్యోగానికి ఎంపికైంది. విజయపుర జిల్లాకు చెందిన చైత్రా కులకర్ణి 26 ఏళ్లకే న్యాయపీఠం అధిష్టించబోతున్నారు. బాగలకోటెలోని ఎస్ఆర్ఎన్ కామర్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వసంత కులకర్ణి కుమార్తె చైత్రా కులకర్ణి విజయపుర జిల్లా ఇండి తాలూకా నందరిగికి చెందినవారు. బాగలకోటెలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ బరగుండి వద్ద మూడేళ్ల పాటు శిక్షణ పొందారు. న్యాయ శాఖలో ఇటీవల 101 జడ్జి ఉద్యోగాల నియమకాలకు జరిగిన పరీక్షలకు 4 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 946 మంది ప్రధాన న్యాయమూర్తి పరీక్షకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలలో 86 మందికిగాను 33 మంది ఎంపిక కాగా వారిలో చైత్రా కులకర్ణి కూడా ఉండడం విశేషం. ఆమె ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మీడియంలోనే విద్యనభ్యసించడం కొసమెరుపు. హైకోర్టులో ఆరు నెలల పాటు శిక్షణ పొందిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టనున్నారు. -
ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి
వలిగొండ (కర్నూలు): ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన కర్నూలు జిల్లా వలిగొండలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన చైత్ర (9) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. అయితే నేడు పిండి మిల్లుకు వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు మిల్లులో పడి మృతి చెందింది. ఈ ఘటన సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.