Mother India Movie
-
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్‌కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్‌కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్‌లో నటించాలని..! -
మహోజ్వల భారతి: వ్యక్తులు, ఘటనలు, సందర్భాలు, స్థలాలు, సమయాలు
సంస్కృతి–సంప్రదాయం టాగోర్ సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ఇండియాలో తొలి ఐఏఎస్. ఉద్యోగరీత్యా ఆయన బ్రిటన్ వెళుతున్నప్పుడు ఆయన భార్య జ్ఞానదానందినీ దేవి భర్త వెంట ఆరు గజాల చీరకట్టు లోనే వెళ్లారు. బ్రిటన్‌లో అంతా ఆమెను చిత్రంగా చూశారు! చీరకట్టు మన భారతీయ మహిళలకు కొత్త కాకపోయినా, ఆరు గజాల చీరకట్టును ‘ఇన్వెంట్’ చేసింది మాత్రం జ్యానదానందినీ దేవేనని అంటారు. సత్యేంద్రనాథ్ 1842 జూన్ 1న జన్మించారు. జ్ఞానదానందినీదేవి, రవీంద్రనాథ్ టాగోర్ వదిన. స్ఫూర్తి గాంధీజీ భారత 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని త్యాగాలూ ఆయన జీవితంలో ఉన్నాయి. 1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్య్ర పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్లారు నేడు నీలం వర్ధంతి. 1913 మే 19న ఇల్లూరులో జన్మించిన సంజీవరెడ్డి 1996 జూన్ 1న బెంగళూరులో కన్ను మూశారు. నెహ్రూను కదిలించిన ‘మదర్ ఇండియా’ ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లకు 1957లో ‘మదర్ ఇండియా’ చిత్రం విడుదలైంది. మహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ చిత్రంలో నర్గిస్ దత్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్ నటించారు. ఈ సినిమా 1958 లో ఆస్కార్ అవార్డుకు ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేట్ అయింది. మహబూబ్ ఖాన్ స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఔరత్ (స్త్రీ) అనే చిత్రం నిర్మించారు. దాని ఆధారంగానే ‘మదర్ ఇండియా’ నిర్మించారు. భారతదేశపు గ్రామ పరిసరాలను ప్రతిబింబించే ఈ చిత్రంలో భారతీయ సగటు స్త్రీ తన కుటుంబంకోసం, తన పిల్లలకోసం పడే పాట్లను హృద్యంగా చిత్రీకరించారు. మదర్ ఇండియా ప్రధాన కథానాయికగా నర్గిస్ మహామహుల ప్రశంసలు అందుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ ఈ చిత్రం ప్రివ్యూ సందర్భంగా నర్గిస్ నటనను కొనియాడారు. నెహ్రూ అయితే ఎమోషనల్ అయ్యారని చిత్ర బృందం అప్పటి మీడియాకు వెల్లడించింది. నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించారు. బాలనటిగా 1935 లో ‘తలాషె హక్’ చిత్రంలో తన ఆరవయేట నటించారు. ఆ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్. ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత నర్గిస్ ఎన్నో సినిమాలలో నటించారు. తన 14వ యేట మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో ఆమె కనిపించారు. బర్సాత్ (1949), అందాజ్ (1949), ఆవారా(1951), దీదార్(1951), శ్రీ420(1955), చోరీ చోరీ (1956) చిత్రాలు నర్గిస్‌కు మంచి పేరు తెచ్చాయి. నేడు నర్గిస్ జయంతి. 1929 జూన్ 1న కలకత్తాలో జన్మించారు. -
Holi 2021: కలర్‌ఫుల్ కలర్స్
ఒక్కరు ఆడరు. మనుషులు గుంపులు. రంగులు బోలెడు. మీసం రంగు మారుతుంది. గాజులు వేరే రంగుకొస్తాయి. ఆట ఒక రంగు. పాట ఒక రంగు. వయసులో ఉన్న కుర్రదీ కుర్రాడూ ఒక రంగు. హోలీ వెలిసిన క్షణాలను దూరంగా విసిరేస్తుంది. ఉత్సాహ కణాలను దేహంలో నింపుతుంది. ఈ పండుగను పెద్ద తెర పండుగ చేసుకుంది. హిందీ సినిమాల్లో హోలీది మహాకేళీ. అందరికీ రంగుల చెమేలీ పూలు. హోలీలో ఎన్ని రంగులు ఉంటాయి? అన్నీ. హిందీ సినిమాల్లో హోలీని అడ్డు పెట్టుకుని ఎన్ని సీన్లు ఉంటాయి? అన్నే. వెండితెర అంటేనే కలర్ఫుల్గా ఉంటుందని కదా... మరి ఆ కలర్‌ఫుల్ తెరకే రంగులు అద్దితే ఎలా ఉంటుంది? చూద్దాం.. ‘మదర్ ఇండియా’ను మొదట చెప్పుకోవాలి. కలర్లో పాత్రలు హోలీ ఆడింది ఆ సినిమాలోనే. ఆడించినవాడు దర్శకుడు మెహబూబ్ ఖాన్. ‘హోలీ ఆయిరే కన్హాయి హోలీ ఆయిరే’ పాట అందులోదే. వితుంతువైన తల్లి నర్గిస్ తన ఇద్దరు కొడుకులు సునీల్ దత్, రాజేంద్ర కుమార్ గ్రామస్తులతో కలిసి పాడుతూ ఉంటే పులకించి భర్త రాజ్‌కుమార్‌తో తాను హోలి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటుంది. కొడుకుల జీవితం, భవిష్యత్తు రంగులమయం కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాని వారిలో ఒక కొడుకు చెడ్డ రంగును, ద్రోహపు రంగును, ఊరికి చేయదగ్గ అపకారపు రంగును పులుముకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగును కడిగి మురిక్కాలువలో పారేస్తుంది. ‘మదర్ ఇండియా’లో నర్గిస్ అదే చేస్తుంది. బందిపోటుగా మారిన కొడుకు సునీల్‌దత్‌ను ఊరి అమ్మాయిని ఎత్తుకుని పోతూ ఉంటే కాల్చి పడేస్తుంది. దేశం గురించి సంఘం గురించి ఆలోచించేవారు ఆ పనే చేస్తారు. సొంత కొడుక్కి తల్లి కావడం ఎవరైనా చేస్తారు. దేశానికి తల్లి కాగలగాలి. మదర్ ఇండియా చెప్పేది అదే. ‘కటీ పతంగ్’ రాజేష్ ఖన్నా 1969–71ల మధ్య ఇచ్చిన వరుస 17 హిట్స్‌లో ఒకటి. ఆ కథ ఒక ‘వితంతువు’ ఆశా పరేఖ్‌కు కొత్త జీవితం ప్రసాదించడం గురించి. నిజానికి ఆశాపరేఖ్ వితంతువు కాదు. మరణించిన స్నేహితురాలి కోసం వితంతువుగా మారింది. ఆమెను రాజేష్ ఖన్నా ప్రేమిస్తాడు. వైధవ్యం పాపం, శాపం కాదని అంటాడు. హోలి వస్తుంది. ‘ఆజ్ న ఛోడేంగే బస్ హమ్ జోలి’అని రాజేష్ ఖన్నా పాట అందుకుంటాడు. కాని తెల్లబట్టల్లో ఉన్న ఆశా పరేఖ్ దూరంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు హోలి ఆడకూడదు. వారికి ఇక శాశ్వతంగా మిగిలేది తెల్లరంగే. కాని రాజేష్ ఖన్నా ఇందుకు అంగీకరించడు. పాట చివరలో రంగుల్లోకి లాక్కువస్తాడు. క్లయిమాక్స్‌లో ఆమెకు రంగుల జీవితం ఇస్తాడు. భర్త చనిపోవడంతో జీవితపు రంగులు ఆగిపోవడం ఒక వాస్తవం కావచ్చు. కాని జీవితం ముందు ఉంది. కొత్త రంగును తొడుక్కుంటే అది తప్పక మన్నిస్తుంది. ‘షోలే’లో గబ్బర్ సింగ్ మనుషుల్ని ఠాకూర్ సంజీవ్ కుమార్ ఆదేశం మేరకు అమితాబ్, ధర్మేంద్రలు తన్ని తగలేస్తారు. మరి గబ్బర్ సింగ్ ఊరుకుంటాడా? రామ్‌గఢ్‌పై దాడి చేయాలనుకుంటాడు. ‘కబ్ హై హోలి.. హోలి కబ్ హై’ అని అడుగుతాడు. ఈ సంగతి తెలియని రామ్‌గఢ్ వాసులు హోలీ వేడుకల్లో మునిగి ‘హోలికె దిన్ రంగ్ మిల్ జాయేంగే’ అని పాడుకుంటూ ఉంటారు. హటాత్తుగా గబ్బర్ ఊడిపడతాడు. ఊరంతా అల్లకల్లోలం. అగ్నిగుండం. అమితాబ్ దొరికిపోతాడు. ధర్మేంద్ర కూడా దొరక్క తప్పదు. ‘నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే వదిలేస్తాను’ అంటాడు గబ్బర్ వాళ్లతో. అమితాబ్ బయలుదేరుతాడు. ఏం జరుగుతుందా అని అందరిలోనూ ఉత్కంఠ. గబ్బర్ కాళ్ల దగ్గరకు నమస్కారం పెట్టడానికన్నట్టు వొంగిన అమితాబ్ అక్కడ కింద ఉన్న రంగులు తీసి తటాలున గబ్బర్ కళ్లల్లో కొడతాడు. చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఈ సీన్ హోలి సీన్లన్నింటిలో తలమానికం. గబ్బర్ భరతం పట్టిన సీన్ అది. ‘సిల్సిలా’లో అమితాబ్ రేఖా ప్రేమించుకుంటారు. కాని అమితాబ్ జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖ సంజీవ్ కుమార్‌ను. రెండు జంటలూ తమ జీవితాలు గడుపుతూ ఉండగా అమితాబ్, రేఖ తిరిగి తారసపడతారు. తమలో ఇంకా ప్రేమ ఉందనుకుంటారు. తమ పెళ్లిళ్లు అర్థం లేనివని భావిస్తారు. తమ తమ భాగస్వాముల మధ్య ఆ సంగతి సూచనగా చెప్పడానికి హోలిని ఎంచుకుంటారు. ‘రంగ్ బర్సే’ పాటను అమితాబ్ పాడుతూ పరాయివ్యక్తి భార్య అని కూడా తలవకుండా రేఖ వొడిలో తల పెట్టుకుని కేరింతలు కొడతాడు. కాని పెళ్లయ్యాక ఈ దేశంలో గతన్నంతా బావిలో పారేయాల్సి ఉంటుంది. పెళ్లికే విలువ. దాని పట్లే స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. చివరిలో ఆ సంగతి అర్థమయ్యి అమితాబ్, రేఖ తమ తమ పెళ్లిళ్లకు నిబద్ధులవుతారు. కాని ఈలోపు వారి వివాహేతర ప్రేమను చూపే పద్ధతిలో ట్రీట్మెంట్ దెబ్బ తిని సినిమా కుదేలైంది. ఇదో చేదురంగు. ‘దామిని’లో హోలీ క్రూర రంగులను చూపిస్తుంది. అందులో మీనాక్షి శేషాద్రి పెద్దింటి కోడలు. కాని మరిది ఆ ఇంట్లో హోలీ రోజున ఆ గోలలో పని మనిషిపై అత్యాచారం చేస్తాడు. మీనాక్షి శేషాద్రి ఆ దుర్మార్గాన్ని చూస్తుంది. దారుణంగా బాధను అనుభవించిన పని మనిషికి న్యాయం చేయడానికి మీనాక్షి శేషాద్రి తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని నిలబడుతుంది. ఆమె మీద ఎన్నో దాడులు. కాని దాడులు నిండినదే లోకం అయితే లోకం ఉంటుందా? ఎవరో ఒకరు తోడు నిలుస్తారు. మీనాక్షి శేషాద్రికి తోడుగా సన్ని డియోల్ నిలుస్తాడు. పోరాడతాడు. న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం గెలిచినప్పుడు ఆ రంగులకు వచ్చే తేజం గొప్పది. ‘డర్’ సినిమా దౌర్జన్యప్రేమను చూపిస్తుంది. అసలు ‘నో’ అనే హక్కు, స్వేచ్ఛ స్త్రీలకు ఉందని కూడా కొందరు మూర్ఖప్రేమికులకు తెలియదు. ఉన్మత్తంగా ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ గొప్పది అయిపోదు. ‘డర్’లో జూహీ చావ్లాను ప్రేమించిన షారూక్ ఖాన్ ఆమె వివాహం అయ్యాక కూడా వెంటపడతాడు. ఆమె ఇంట్లో హోలీ చేసుకుంటూ ఉంటే ముఖాన రంగులు పూసుకుని ప్రత్యక్షమవుతాడు. భయభ్రాంతం చేస్తాడు. ఎంత హింస అది. రంగు ముఖానికి పూసుకుంటే బాగుంటుంది. కళ్లల్లో పడితే బాగుంటుందా? కళ్లల్లో పడే రంగును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చివరకు ఆ రంగు సముద్రంలో కలిసిపోతుంది. రంగులు అన్నీ మంచివే. కాని కొన్ని రంగులు కొందరికి నచ్చవు. అలాగే కొన్ని జీవన సందర్భాలు కూడా నచ్చవు. కాని నచ్చని రంగులు ఉన్నప్పుడే నచ్చే రంగులకు విలువ. నచ్చని జీవన సందర్భాలు ఉన్నప్పుడే నచ్చే జీవన సందర్భాలకు విలువ. పాడు రంగులనూ పాత గాయాలనూ వదిలి కొత్త రంగుల్లోకి కొత్త ఉత్సాహాల్లోకి ఈ హోలి అందరినీ తీసుకెళ్లాలని కోరుకుందాం. హ్యాపీ హోలీ. – సాక్షి ఫ్యామిలీ -
మన రాష్ట్రంలో హోలీ సంబరాలు
-
మన దేశ హోలీ సంబరాలు
-
వెండి తెరపై వన్నె తరగని రంగేళీ
రంగులు పండుగ హోలీ అంటే ఇష్టపడని వారుండరు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సాగే రంగుల కేళీ ఆడేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువతీ యువకులు రంగుల్లో తడిచిముద్దవుతారు. వెండి తెరపై కూడా హోలీకి సముచిత స్థానం కల్పించారు. రంగుల లోకంలో రంగుల పండుగకు పెద్దపీటే వేశారు. సినిమాల్లో హుషారుగా సాగిపోయే హోలీ పాటలు ప్రేక్షకులు ఆదరించి పట్టం కట్టారు. సమకాలిన సినిమా పాటల్లో హోలీ ప్రస్తావన పరిపాటిగా మారిందంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో ముందుగా వస్తుంది హోలీ రంగుల పాట. ‘రంగు రపరప అంటోంది రంగుబర్సే’ అంటూ హుషారైన స్టెప్పులతో రంగులు జల్లుకుంటూ సాగిపోతుందీ పాట. ‘కొట్టు కొట్టు కొట్టు...రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ 'మాస్' చిత్రంలో నాగార్జున ఆడిపాడారు. తనకెంతో పేరు తెచ్చిన 'ఖుషీ' సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా 'హోలీ... హులీల రంగ హెలీ' అంటూ స్టెప్పులేశారు. 'మురారి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ పాటలో రంగుల్లో మునిగి తేలాడు. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర'లో తన కుటుంబ సభ్యులతో హోలీ ఆడే సీన్ కన్నులపండువ ఉంటుంది. ఉదయ్‌కిరణ్-రిచా చావ్లా జంటగా ‘హోలీ’ పేరుతో ఓ ప్రేమకధా చిత్రమే వచ్చింది. ఉత్తరాది వారు ఘనంగా జరుపుకునే హోలీకి బాలీవుడ్ కూడా పెద్దపీట వేసింది. నాటి షోలే నుంచి నేటి రామ్ లీలా వరకు రంగుళ కేళీని ఏదో ఒక సందర్భంలో తెరపై ఆవిష్కరిస్తూనే ఉంది. ఆన్,కోహినూర్, గోదా, కటీ పతంగ్, సిల్సిలా సినిమాల్లో హోలీ పాటలు ప్రజాదరణ పొందాయి. మదర్ ఇండియా, షోలే సినిమాల్లో కీలక సన్నివేశాల్లో వచ్చే హోలీ పాటలు కథను ముందుకు నడిపించడంలో దోహదపడ్డాయి. నాటి నుంచి నేటి వరకు వెండితెరపై రంగుల పాటల వన్నె తరగలేదు. కొత్త సినిమాల్లోనూ హోలీ పాటలు వస్తూనే ఉన్నాయి. ఇకముందు కూడా వస్తుంటాయి. ఎందుకంటే పండుగ మాత్రమే కాదు ఆనందాల కేళీ!