
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవ వేదనతో వచ్చిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో శిశువుకు జన్మనిచ్చింది. అయినా సిబ్బంది స్పందించకపోవడంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, గర్భిణి బంధువుల కథనం ప్రకారం.. మెదక్ మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన రజిత నొప్పులతో శుక్రవారం సాయంత్రం మెదక్ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, ప్రసవం కష్టమవుతుందని.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో గర్భిణి టాయిలెట్‌కు వెళ్లగా నొప్పులు అధికమై అక్కడే ప్రసవించింది. దీంతో ఆమెకు వైద్యం అందించాలని సిబ్బందిని వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో ఆమె బంధువుల ఆందోళనతో ఉన్నతాధికారులు ఆమెకు చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment