Medak Government Hospital
-
టాయిలెట్లో మహిళ ప్రసవం
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవ వేదనతో వచ్చిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో శిశువుకు జన్మనిచ్చింది. అయినా సిబ్బంది స్పందించకపోవడంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, గర్భిణి బంధువుల కథనం ప్రకారం.. మెదక్ మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన రజిత నొప్పులతో శుక్రవారం సాయంత్రం మెదక్ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, ప్రసవం కష్టమవుతుందని.. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో గర్భిణి టాయిలెట్కు వెళ్లగా నొప్పులు అధికమై అక్కడే ప్రసవించింది. దీంతో ఆమెకు వైద్యం అందించాలని సిబ్బందిని వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో ఆమె బంధువుల ఆందోళనతో ఉన్నతాధికారులు ఆమెకు చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. -
ఆస్పత్రి బాత్రూమ్లోనే ప్రసవం
సాక్షి, మెదక్: ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది. ప్రసవ వేదనతో ఆస్పత్రికొచ్చిన ఓ మహిళను డాక్టర్లు పట్టించుకోలేదు. ఈ ఘటన మెదక్ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్ మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన రజిత పురుటి నొప్పులతో శుక్రవారం సాయంత్రం మెదక్ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చేసిన ఆమెకు రక్తం తక్కువగా ఉందని ప్రసవం కష్టం అవుతుందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈక్రమంలో మరుగుదొడ్డి నిమిత్తం రజిత బాత్రూమ్ వెళ్లారు. అక్కడే నొప్పులు ఎక్కువ కావడంతో వైద్య సాయం కోసం కేకలేశారు. అయినా ఎవరూ రాలేదు. నొప్పులు తీవ్రం కావడంతో ఆమె బాత్రూమ్లోనే ప్రసవించింది. పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇది గమనించిన బంధువులు ఆమెను అక్కడ నుంచి వార్డులోకి తీసువెళ్లి చికిత్సకు సహకరించాలని వైద్యుల్ని వేడుకున్నారు. అయినా సిబ్బంది ఎవరూ స్పందించలేదు. దాంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రిలో అడ్మిషన్ చేసుకుని చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ సిబ్బంది తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. -
ఓపీ సేవలు అదనం?
మెదక్జోన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు రోగులసంఖ్యకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఆస్పత్రి అప్గ్రేడ్ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఒకప్పుడు సర్కార్ దవాఖానా అంటేనే భయపడే వారు ప్రస్తుతం బారులు తీరి చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. బయటనుంచి వచ్చే రోగులకు (ఓపీ) చికిత్స అందించే సమయం ప్రస్తుతం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగుతోంది. ఈ లెక్కన రోజుకు 3గంటలు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్న క్రమంలో జిల్లా నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారికి చికిత్స అందకుండానే సమయం దాటిపోతుండడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బయటనుంచి వచ్చే రోగులకు చికిత్సలు అందజేసేలా సమయాన్ని పొడిగించినట్లు తెలిసింది. ఇకపై నిత్యం 5గంటలపాటు వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సైతం ఈ సమయం మారనుంది. డయాగ్నస్టిక్ (ల్యాబ్) సేవల సమయాన్ని సైతం అదనంగా రెండు గంటలు పెంచనున్నారు. ఆదేశాలు రాగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే ఓపీ సమయం అదనంగా రెండు గంటలు పెంపు విషయం ఇంకా అధికారికంగా అందలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆదేశాలు రాలేదని భావిస్తున్నాం. ఆదేశాలు రాగానే ఉదయం సమయాన్ని అమలు చేస్తాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి -
వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు
మెదక్: వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆస్పత్రికి తీసుకు వచ్చిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే వైద్యం సరిగా చేయలేదని అతని బంధువులు ఆగ్రహంతో డాక్టర్పై దాడి చేశారు. ఈ దాడిలో డాక్టర్ ఆశ్వీర్వాదం కాళ్లు,చేతులు విరిగాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.