చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన దాడితో సంబంధం ఉన్న మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన దాడితో సంబంధం ఉన్న మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని కోల్‌కతాలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా నెల్లూరు తరలించారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై దాడి కేసులో అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని సమాచారం. మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ అనుచరుడైన దీపక్ పై పలు కేసులున్నాయి.