హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీల కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హంట్ పేరుతో బూటకపు ఎన్ కౌంటర్ చేసిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఆయన సోమవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పోరాటానికి అండగా ఉన్న మావోయిస్టులను హత్య చేశారన్నారు. ఎన్ కౌంటర్ నిజమయితే న్యాయబద్ధంగా విచారణ జరిపించాలని హరగోపాల్ డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం అదుపులో ఉన్న ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, ఏవోబీలో గ్రేహౌండ్స్ కూంబింగ్ను తక్షణమే నిలిపివేయాలని, బూటకపు ఎన్ కౌంటర్లో 32మందిని చంపిన అధికారులపై హత్యానేరం మోపి కఠినంగా శిక్షించాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎఫ్) డిమాండ్ చేసింది.
‘గ్రీన్ హంట్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్’
Published Mon, Oct 31 2016 3:51 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement
Advertisement