ఆర్కే పోలీసుల వద్దనే ఉన్నాడనడానికి ఆధారాలేవి?
ఆర్కే పోలీసుల వద్దనే ఉన్నాడనడానికి ఆధారాలేవి?
Published Thu, Nov 3 2016 1:19 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే తమ అదుపులో లేడని ఆంద్రప్రదేశ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపి పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఆర్కే ఆచూకీని తెలపాలని కోరుతూ ఆయన భార్య శిరీష దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ఏపీ పోలీసులు ఆర్కే తమ వద్ద లేడని కౌంటర్‌లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్కే పోలీసుల వద్దే ఉన్నాడని విన్నవించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆధారలుంటే కోర్టు ముందు ఉంచాలని పిటిషన్ తరపు లాయర్ కు సూచించారు. ఆధారాలు సమర్పించేందుకు పిటిషనర్ 10 రోజుల గడువును కోరారు. దీనిపై విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.
ఆర్కే పోలీసులు అదుపులో ఉన్నాడనడంలో వాస్తవం లేదని విశాఖ ఎస్పీ తెలిపారు. ఆర్కే పై 40 కేసులు ఉన్నాయని, 22 కేసుల్లో ఆయన కోర్టుకు హాజరు కావడంలేదని తెలిపారు.
ఏఓబిలో జరిగిన ఎన్ కౌంటర్ సమయం నుండి మావో అగ్రనేత రామకృష్ణ ,గాజర్ల రవి, చలపతిల ఆచూకీ లేదు. ఇప్పటివరకు వారి సమాచారం గురించి పార్టీ వర్గాలకు సమాచారం చేరలేదు. దీంతో పోలీసుల అదుపులోనే మావో అగ్రనేతలు ఉన్నారని రామకృష్ణ కుటుంబసభ్యులు , ప్రజాసంఘాలు, హాక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. రామకృష్ణ ఆచూకీ కోసం ఆయన సతీమణి రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement