మావోయిస్ట్ నేత రామకృష్ణను వెంటనే కోర్టులో హజరుపరచాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
లెఫ్ట్ పార్టీల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ నేత రామకృష్ణను వెంటనే కోర్టులో హజరుపరచాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గత నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్, ఆ తర్వాత జరిగిన కాల్పులపై న్యాయవిచారణకు ఆదేశించాలని మంగళవారం జరిగిన ఎనిమిది వామపక్ష పార్టీల సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్, ఆ తర్వాతి ఘటనలపై పోలీసు అధికారుల విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమ వుతున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఆర్కేను పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉంచుకోవడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆర్కే బంధువులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఈ మేరకు చాడ వెంకటరెడ్డి (సీపీఐ), చెరుపల్లి సీతారాములు (సీపీఎం), సాధినేని వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ-చంద్రన్న), జె.జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), తాండ్రకుమార్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), భూతం వీరన్న (సీపీఐ-ఎంఎల్) సంయుక్త ప్రకటన విడుదల చేశారు.