సీనియర్ మావోయిస్ట్ నేత, సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్ జీ అలియాస్ దేవ్‌కుమార్ సింగ్ బుధవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌లోని బుద్ధా పహాడ్ అటవీప్రాంతంలో ఆయన చనిపోయినట్లు వెల్లడించారు. జార్ఖండ్‌లో ఇంతకుముందు పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన పలు దాడులకు వ్యూహాలు రచించిన అరవింద్ జీపై రూ.1.50 కోట్ల రివార్డు ఉందన్నారు.