ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె మృతిపై రాజకీయ ప్రముఖులు, సినీప్రముఖులు, క్రీడాప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవి భౌతికకాయం ఈ రోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో అంధేరిలోని శ్రీదేవి నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.