మావోయిస్టు నేత గాజర్ల అశోక్ మంగళవారం వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి సమక్షంలో లొంగిపోయాడు.
వరంగల్: మావోయిస్టు నేత గాజర్ల అశోక్ మంగళవారం వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి సమక్షంలో లొంగిపోయాడు. సీపీఐ మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా, దక్షిణ బాస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేశాడు. అశోక్ పై 25 కేసులు ఉన్నాయి.
మావోయిస్టు పార్టీ నాయకత్వంలో అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపాలు, మావోయిస్టు పార్టీకి ప్రజలలో వ్యతిరేకత పెరగడంతో అశోక్ లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు.