
సుకుమా (చత్తీస్‌గడ్): మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కడు. చత్తీస్‌గడ్ కేంద్రంగా మావోయిస్టులు చేపట్టిన అనేక ఆపరేషన్లలో హుంగా కీలకంగా వ్యవహరించాడు. మావోయిస్టుల పార్టీలో హుంగాను టైగర్‌గా పిలుచుకుంటారు. అయితే టైగర్ హూంగాను అరెస్టు చేసినట్లు సుకుమా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు.
టైగర్ హుంగా దాడుల్లో దిట్ట
చత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లా కిస్టారం ప్రాంతంలో మావోయిస్టులు దాడికి సంబంధించి 17 ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు పాలోది ప్రాంతంలో ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహన పేల్చివేతలో టైగర్ హూంగా ప్రధాన బాధ్యత తీసుకున్నాడు. ఈ పేలుడులో 9 మంది జవాన్లు చనిపోయారు. 2020లో టైగర్ హూంగా నేతృత్వంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ మరణించారు. ఇటీవల దండకారణ్యంలో జరిగిన పలు ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment