గణపతిని పట్టిస్తే రూ. కోటి | maharashtra announces one crore reward for nabbing maoist leader ganapathi | Sakshi
Sakshi News home page

గణపతిని పట్టిస్తే రూ. కోటి

Published Fri, Aug 22 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

గణపతిని పట్టిస్తే రూ. కోటి

గణపతిని పట్టిస్తే రూ. కోటి

మహారాష్ట్ర ప్రభుత్వం రివార్డు ప్రకటన

న్యూఢిల్లీ/ముంబై: మావోయిస్టు అధినేత ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతిపై మహారాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భారీస్థాయిలో రివార్డును ప్రకటించింది. గణపతి అరెస్ట్‌కు దోహదపడే సమాచారం అందించే వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. మావోయిస్టు గ్రూపు సెంట్రల్ కమిటీ సభ్యుడు లేదా పోలిట్ బ్యూరో సభ్యుడి అరెస్టుకు ఉపకరించే సమాచారం అందిస్తే రూ. 60 లక్షల రివార్డు ఇస్తామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  గణపతితోపాటు దాదాపు డజన్ మంది మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులకోసం పోలీసులు చాలాకాలంగా గాలింపు కొనసాగిస్తూ వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement